సమంత నటించిన శకుంతల సినిమా కూడా మొదటి నుంచి డిజాస్టర్ ట్రాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గుణశేఖర్ స్వయంగా డైరెక్ట్ చేసి నిర్మించిన ఈ సినిమా మీద ముందు నుంచి ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి వుంది.పైగా దానికి తోడు దిల్ రాజు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం ప్యాన్ ఇండియా లెవెల్ లో హిందీ, తమిళ, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ కలెక్షన్స్ మాత్రం రోజు రోజుకు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. ఈ సినిమా ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల 37 లక్షల షేర్ నాలుగు కోట్ల 70 లక్షల వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు కోట్ల నాలుగు లక్షల షేర్ 8 కోట్ల 45 లక్షల గ్రాస్ ని వసూలు చేసింది.ఈ సినిమా బిజినెస్ ని బట్టి  హిట్ అవ్వాలంటే 14 కోట్ల 96 లక్షలు ఖచ్చితంగా వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే  ఈ సినిమా రిలీజ్ అయిన రోజే రాఘవ లారెన్స్ హీరోగా రుద్రుడు అనే సినిమా కూడా విడుదల అయింది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా డివైడ్ టాక్ ని తెచ్చుకోవడం జరిగింది.


అయితే ఇది మాస్ మూవీ కావడంతో తెలుగు రాష్ట్రాల వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమా 80 లక్షలు తర్వాత 53 లక్షలు, 57 లక్షలు, 28 లక్షల 5వ రోజు రకంగా 19 లక్షలు వసూలు చేసింది. ఐదవ రోజు సమంత సినిమా 12 లక్షలు వసూలు చేస్తే తమిళ హీరో అయిన రాఘవ లారెన్స్ సినిమా ఏకంగా 19 లక్షలు వసూలు చేయడం గమనార్హం. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదు రోజుల్లో మొత్తం రెండు కోట్ల 37 లక్షలు వసూలు చేసింది.అంటే దాదాపుగా సమంత సినిమాతో సమానంగా ఈ సినిమా వసూలు చేయడం విశేషం.ఇక ఈ సినిమా తమిళనాడులో ఐదు కోట్ల 60 లక్షలు గ్రాస్ వసూలు చేయగా కర్ణాటకలో 43 లక్షలు మిగతా భారతదేశంలో 18 లక్షలు ఇంకా ఓవర్సీస్ లో కోటి 22 లక్షలు మొత్తం కలిపి 11 కోట్ల 88 లక్షల గ్రాస్ 5 కోట్ల ఎనిమిది లక్షల షేర్ ని వసూలు చేసింది. ఈ వసూళ్లు సమంత సినిమా కంటే ఎక్కువ. అంటే సమంత సినిమాతో పాటు రిలీజ్ అయిన రుద్రుడు సినిమా సమంత సినిమాని బీట్ చేసి స్పీడ్ గా దూసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: