మెగా డాటర్ నిహారిక  గత కొంత కాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తునే వున్నారు..ఈమె గత కొంతకాలంగా తన భర్తతో దూరంగా ఉంటున్నారని వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో నిహారిక మాత్రం ఈ వార్తలు గురించి ఏ మాత్రం స్పందించకుండా ఈ వార్తలను ఖండించే ప్రయత్నం కూడా చేయకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిహారిక ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు నిర్వహిస్తూ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తెగ సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ రంగంలో కొనసాగుతున్నటువంటి ఈమె తిరిగి సినిమాలలో కూడా నటించబోతున్నారని అందుకే పెద్ద ఎత్తున ఫోటోషూట్లు కూడా చేయడమే కాకుండా సినిమాలకు అనుగుణంగా భారీగా వర్కౌట్ చేస్తూ జిమ్ లో కూడా ఎక్కువగా సమయం గడుపుతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా నిహారిక హైదరాబాద్లో ఆఫీస్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయిన నిహారిక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది. నిహారిక సోషల్ మీడియాలో ఇంఫ్లూయెన్సర్ నిహారికతో  కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. మూవీ టైం అంటూ ల్యాప్ ట్యాప్లో సినిమాను చూస్తూ, స్నాక్స్ తింటూ సందడి చేసినట్టుగా సమాచారం..ఇలా వీరిద్దరూ ఒకే చోట ఉండి రాత్రంతా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంఫ్లూయెన్సర్ నిహారిక కూడా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఏదైనా సినిమాలు కనుక విడుదల అవుతూ ఉంటే పెద్ద ఎత్తున ఈమె ఇంటర్వ్యూలు కూడా చేయడం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం వంటివి కూడా చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: