
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం శ్రీయ బిజీగా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మ్యూజిక్ స్కూల్ కథ వినగానే తనకు ఎంతో ఎక్సైటింగ్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ స్కూల్ లో సంగీతం నేర్పించే టీచర్ పాత్రలో నటించాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే పిల్లల్లో ఉండే ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి.
ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలని అంటూ శ్రీయ చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండా ప్రోత్సహించారని తెలిపింది. ఇక మా అమ్మాయి రాదను కూడా చదువుతో పాటు సంగీతం డాన్స్ ఆటల్లో ప్రోత్సహిస్తాను అంటూ శ్రీయ తెలిపింది. ఇక డైరెక్టర్ పాపారావు గారు ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఇళయరాజా ఈ సినిమాకు అందించిన సంగీతమైతే హైలెట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇన్నాళ్ళ నా కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇది అదృష్టంగా భావిస్తున్నాను అంటూ శ్రియ తెలిపింది. మరి శ్రియ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజిక్ స్కూల్ సినిమా ఈ అమ్మడి కేరియర్ కు ఎలా ఉపయోగ పడుతుందో చూడాలి మరి.