
ఆ తర్వాత పూణేలో ఈ సినిమా షూటింగ్ చేయడం జరిగింది తాజాగా.. ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు ఒక భారీ ఈవెంట్ను కూడా నిర్వహించి ఈ సినిమా గ్లింప్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ విషయంలో ఈ రోజున క్లారిటీ వస్తుందని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఓజి సినిమా చిత్రీకరణ కోసం పవన్ కళ్యాణ్ రెండు వారాలపాటు తన సమయాన్ని కేటాయించారు.
ఇప్పుడు మరో రెండు వారాలు ఉస్తాద్ చిత్రానికి సమయాన్ని కేటాయించడంతో ఈ సినిమాకు వీలైనంతవరకు టాకీ పార్టును పూర్తి చేయాలని డైరెక్టర్ హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటివరకు సినిమా యొక్క కీలకమైన సన్నివేశాలను మొదటి షెడ్యూల్లో పూర్తి చేసిన హరిశంకర్ ఇప్పుడు ఈ సినిమా పైన మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ తో ఈ సినిమాలోని సగం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాది మాత్రం వినోదయ సీతమ్ అనే రీమిక్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్.