తెలుగు సినిమా కమర్షియల్‌ మూస దారిలో ప్రయాణిస్తుంటే ఆ సినిమాను చేయి పట్టి పక్కలాగే ప్రయత్నం చేశారు కొంత మంది దర్శక నిర్మాతలు. అలాంటి ప్రయత్నమే మా భూమి. 40 ఏళ్ల క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు తెర మీద కొత్త దారులకు బాటలు వేసింది. అప్పట్లో భారీగా చర్చనీయాంశం అయిన  ఆ సినిమా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.

 

ఈ సినిమాన కిషన్‌ చందర్‌ రాసిన జబ్‌ ఖేత్‌ జాగే అనే ఉర్దూ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ముందుగా ఆ సినిమా బెంగాలీ దర్శకుు మృణాల్‌ సేన్ దర్శకత్వం వహిస్తారని భావించినా ఆయనకు  కుదరకపోవటంతో ఆన సలహా మేరకు గౌతమ్‌ ఘోష్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. తెలంగాణలో అప్పటి వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో ఆ కథను సిద్ధం చేశారు.


ఈ సినిమాతో ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు, త్రిపురనేని సాయి చంద్‌ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు బీ నర్సింగ్‌ రావు ఈ సినిమాను నిర్మించటమే కాదు స్క్రీన్‌ ప్లే కూడా ఆయనే అంధించారు. సంచలన విజయం సాదించిన ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ ప్లే విభాగాల్లో నంది అవార్డు కూడా రావటం విశేషం. ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ ఎన్‌ ఐబీఎన్ ప్రకటించిన వంద అత్యుత్తమ భారతీయ చిత్రాల జాభితాలో మా భూమికి స్థానం దక్కింది.


దాదాపు ఐదున్నర లక్షల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమాను మెదక్‌ జిల్లాలోని మంగళ్‌ పర్తిలో చిత్రీకరించారు. దర్శకుడు గౌతమ్ ఘోష్ సంగీత దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకోవటం విశేషం. తక్కువ ప్రింట్‌లతో కేవలం ఉదయం ఆటలే ప్రదర్శించే విధంగా విడుదల చేసిన ఈ సినిమా హైదరబాద్‌లోని సుదర్శన్ థియేటర్ లో ఏకదాటిగా ఏడాది పాటు ఆడింది. ఈ సినిమా నెగెటివ్‌ కూడా పాడైపోవటంతో 2015లో సినిమా డిజిటలైజ్‌ చేసిన డీవీడీ రూపంలో రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: