ఈ మ‌ధ్య బుల్లి తెర యాంక‌ర్లు ఒక‌రిని మించిన వారు మ‌రొక‌రు ఉంటున్నారు. ఒక్క షో చేస్తే చాలు ఎక్క‌డ‌లేని క్రేజ్ మొత్తం సంపాదించేస్తున్నారు. ఇక ఆ షోల్లో వాళ్ళు చేసే ఓవ‌ర్ యాక్ష‌న్స్ అయితే అంతా ఇంతా కాదు. ఒక్కోసారి చూడాలంటే విసుగు వ‌చ్చేలా చేస్తారు. ఒక సినిమాల్లో రాణించాలంటే చాలా వ‌ర‌కు సాక్రిఫై చేయాలి. ఎవ‌రు ఎలాంటి ఆబ్లీగేష‌న్స్ వుంటాయి.. చాలా రూల్స్ ఉంటాయి. అన్నీ త‌ప్ప‌కుండా పాటించాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే అన్నీ అంగీక‌రించాల్సిందే. ఇండ‌స్ట్రీలో ఓ స్టార్ స్టేట‌స్ కావాలంటే కొన్ని త‌ప్ప‌వు. అవ‌స‌రం వున్నా లేక‌పోయినా.. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా చేయ‌క‌పోయినా ఎక్స్‌పోజింగ్ , లిప్ లాక్‌లకు ప్ర‌స్తుతం హీరోయిన్ల‌యితే త‌ప్ప‌కుండా సిద్ధ‌ప‌డాల్సిందే. అందుకు ఏమాత్రం అంగీకరించ‌ని వారికి కెరీర్ అనేదే వుండ‌దు. శ్రీ‌ముఖి విష‌యంలోనూ అచ్చం ఇదే జ‌రిగింద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టింది. మ‌రి ఈ యాంక‌ర్ భామ ఎందుకు ఒప్పుకోలేదు. అస‌లు ఇబ్బంది ఎక్క‌డ వ‌చ్చిందో ఓ సారి చూద్దాం.

 

అల్లు అర్జున్‌తో త్రివిక్ర‌మ్ రూపొందించిన `జులాయి` సినిమా చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. హీరోయిన్‌గానే రాణించాలంటే ఎక్స్‌పోజింగ్‌తో పాటు లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించాల్సిందేనని డైరెక్ట‌ర్‌లు శ్రీ‌ముఖిని బ‌ల‌వంత పెట్టార‌ట‌. అవి లేకుండా ఇక్క‌డ కుద‌ర‌దు అన్నార‌ట‌. అంతేకాక క‌థ డిమాండ్ ఉన్నా లేక‌పోయినా ఇక్క‌డ చెయ్య‌మ‌న్న‌ది చెయ్యాల్సిందే. క‌థ అవ‌స‌రం త‌ప్ప‌దు అలాంటివేమీ ఉండ‌వు. చెప్పింది చెయ్యాలి అన్న‌ట్లుగా కుంద‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పార‌ట‌. దాంతో ఏం చేయాలో తెలియ‌క‌... చివ‌రికి  అది న‌చ్చ‌కే తాను సినిమాల్లో న‌టించ‌డం మానేశాన‌ని, బుల్లితెర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిపోయాన‌ని శ్రీ‌ముఖి అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టింది.

 

ఇక ఇదిలా ఉంటే... ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఏదో ఒక‌టి అని ఇండ‌స్ట్రీ మీద బుర‌ద జ‌ల్ల‌డ‌మే అని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. మిగ‌తా వారికి అవ‌కాశాలు రావ‌డం లేదా. కేవ‌లం వీళ్ళ‌నే టార్గెట్ చేసిన‌ట్లు ఎందుకు మాట్లాడ‌తార‌ని మ‌రి కొంద‌రు సోష‌ల్ మీడియాలో శ్రీ‌ముఖి పై విరుచుకుప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: