తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.  బాలనటుడిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టి హీరోగా నెంబర్ వన్ రేస్ లో ఉన్నాడు. టెంపర్ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్నాడు ఎన్టీఆర్.  ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మ‌న హీరోలు అప్పుడ‌ప్పుడూ ఫ్యామిలీ టైమ్ కూడా ఇస్తుంటారు. ముఖ్యంగా  మ‌హేష్ బాబు, అల్లు అర్జున్, నాని లాంటి హీరోలు అయితే ముందు ఫ్యామిలీ ఆ త‌ర్వాతే చిత్రాలకు ప్రాదాన్యత ఇస్తుంటారు.  ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నాడు. మే 5న ఈయ‌న పెళ్లి రోజు. దాంతో త‌న టైమ్ అంతా భార్య తన కొడుకులకు సమయాన్ని పూర్తిగా కేటాయిస్తుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 

 

వాస్తవానికి తాను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన పెళ్లిరోజు తన కుటుంబంతో ఉండే ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి తన ఫ్యామిలీనే గడుపుతున్న విషయం తెలిసిందే.  కరోనా మహమ్మారి తో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ విధించారు. దాంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఇంటి వద్దే ఉంటూ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.  ఆ మద్య తన ఇంటి పనులు చేస్తూ ఓ వీడియో షూట్ చేసి మెగాస్టార్ కి చాలెంజ్ విసిరాడు. 

 

రాజ‌మౌళి సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఇంకా టైమ్ ఉండ‌టంతో ప్ర‌స్తుతం కుటుంబంతో ఉన్నాడు ఎన్టీఆర్. హాయిగా తన మ్యారేజ్ డేను ఎంజాయ్ చేస్తున్నాడు నంద‌మూరి చిన్నోడు. ఇక ఈయ‌న అభిమానులు కూడా సోష‌ల్ మీడియాను విషెస్‌తో నింపేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ తోమరో మూవీకి సిద్దమవుతున్నాడు ఎన్టీఆర్.   నేడు పెళ్లిరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్- ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిలకు ఇండియాహెరాల్డ్.కామ్ శుభాకాంక్షలు తెలుపుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: