ఎటువంటి పరిస్థితులలోను ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను కరోనా పరిస్థితులతో పోరాటం చేస్తూ వీలైనంత త్వరలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను మొదలు పెట్టాలి అని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రాజమౌళికి లేటెస్ట్ గా అలియా భట్ నుండి వచ్చిన ఫోన్ కాల్ తీవ్ర నిరాశను కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అలియా ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం మే నుండి జూన్ నెల వరకు ఇచ్చిన బల్క్ డేట్స్ షూటింగ్ ల రద్దు మూలంగా వృథా కావడంతో అలియా ను జూలై నెలకు సంబంధించి బల్క్ డేట్స్ ను ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కోసం ఇమ్మని అడిగినట్లు తెలుస్తోంది.

 

అయితే అలియా ఏమాత్రం మొహమాటం పడకుండా తాను కరోనా కేసులు కంట్రోల్ లోకి వచ్చే వరకు ముంబాయి వదిలి హైదరాబాద్ కు రానని ప్రస్తుతం ముంబాయి కరోనా కేసుల విషయంలో అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని తలపిస్తున్న పరిస్థితులలో తనకు ముంబాయి ఎయిర్ పోర్ట్ కు వచ్చే ధైర్యం కూడ లేదని చెప్పినట్లు టాక్. అంతేకాదు ప్రస్తుతం హైదరాబాద్ కరోన కేసులతో అట్టుడుకి పోతున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను హైదరాబాద్ లోని సెట్ లో కూడ నిర్వహించడం యూనిట్ లోని ఎవరికీ మంచిదికాదని అలియా రాజమౌళికి సున్నితంగా రివర్స్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.


ఇప్పుడు అలియా అభిప్రాయం తెలియడంతో చరణ్ జూనియర్లు మంచి జోష్ లో ఉన్నారు అని టాక్. వాస్తవానికి ఈ అభిప్రాయాలు అన్నీ చరణ్ జూనియర్ల లకు ఉన్నప్పటికీ వారు తమ అభిప్రాయాలను రాజమౌళితో పై ఉన్న గౌరవంతో బయటకు చెప్పలేకపోతున్నారని అయితే అలియా తన సహజ సిద్ధమైన ముక్కుసూటి స్వభావంతో రాజమౌళికి అలియా తన అభిప్రాయాలను చాల స్పష్టంగా చెప్పింది అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.


దీనితో ఈ నెలాఖరుకు ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన ట్రైల్ షూట్ ను నిర్వహించి వచ్చేనెల నుండి ఎటువంటి బ్రేక్ లేకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను మొదలుపెట్టాలని భావిస్తున్న రాజమౌళికి ఇప్పుడు అలియా షాక్ తగిలింది అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పుమంటున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: