పండుగ వచ్చింది అంటే బుల్లితెర మీద సందడి మొదలైనట్టే. ఈ దసరాకి స్పెషల్ ప్రోగ్రాంస్ తో సందడి చేస్తున్నాయి. జీ తెలుగు, ఈటివి, స్టార్ మా మూడు ఛానెల్స్ ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా షోలు చేస్తున్నాయి. స్టార్ మాలో జాతరో జాతర.. జీ తెలుగులో చిరంజీవి ప్రదీప్.. చిలసౌ శ్రీముఖి.. ఈటివిలో అక్కా ఎవరే అతగాడు షోలతో వస్తున్నారు.

ఈటివిలో ఎప్పటిలానే జబర్దస్త్ టీం లతో ఆట పాటలతో హంగామా చేస్తున్నారు. ఇక స్టార్ మాలో జాతరో జాతర అంటూ సీరియల్ స్టార్స్ తో పాటుగా జబర్దస్త్ కమెడియన్స్ కూడా 'ఈ షోలో పాల్గొన్నారు. ఇక జీ తెలుగులో స్టార్ యాంకర్స్ ప్రదీప్, శ్రీముఖిలతో షో వస్తుంది. ఆదివారం దసరా పండుగ సందర్భంగా సరదాగా సాగే ఈ షోలు బుల్లితెర ఆడియెన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చేలా ఉన్నాయి.  

ఏ ఛానెల్ కు ఆ ఛానెల్ ఆడియెన్స్ ను అలరించేలా తమ షోలతో అలరించేలా ప్లాన్ చేశారు. స్టార్ మా, ఈటివి, జీ తెలుగు మూడు రేసులో పోటీ పడుతున్నాయి. తప్పకుండా ఈ స్పెషల్ ఎపిసోడ్స్ టి.ఆర్.పి లతో కూడా పోటీ పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ఈ షోలు ఎలా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ షోలు ప్రేక్షకులను అలరించడమే టార్గెట్ గా వస్తున్నాయి. రియాలిటీ షోలతో పాటుగా పండుగ స్పెషల్ గా వచ్చే ఈ ఎపిసోడ్స్ కూడా హైలెట్ గా ఉంటాయని చెప్పొచ్చు.                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: