ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోలుగా భారీ స్థాయిలో క్రేజ్, ఫాలోయింగ్ తో కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల మరింత వేగవంతంగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ప్రస్తతం సర్కారు వారి పాట మూవీ చేస్తోన్న సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో త్రివిక్రం శ్రీనివాస్, రాజమౌళి ల దర్శకత్వంలో తదుపరి సినిమాలు చేయనున్నారు. మరోవైపు ఇటీవల వకీల్ సాబ్ షూట్ కంప్లీట్ చేసిన పవర్ స్టార్, ఆ వెంటనే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ అలానే అయ్యప్పనుం కోషియం మూవీ రీమేక్ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు.

ఇక వీరిద్దరూ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధిస్తే వీరి క్రేజ్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ప్రస్తుతం వీరిద్దరి తనయులు కూడా ప్రేక్షకుల దృష్టిలో మంచి పేరు దక్కించుకుంటూ కొనసాగుతున్నారు. ఇటీవల నిహారిక పెళ్ళిలో సందడి చేసి అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్న పవన్ తనయుడు అకీరా నందన్, అప్పుడప్పుడు తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి పలు ఫోటోలు దిగుతూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నారు. అలానే ఎప్పటికప్పుడు తన చెల్లి సితారతో కలిసి పలు సందర్భాల్లో ఫోటోలు, వీడియో లు దిగుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో సందడి చేస్తున్న గౌతమ్, ఫ్యామిలీ తో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.

ఇక ప్రస్తుతం అటు అకిరా, ఇటు గౌతమ్ ఇద్దరూ కూడా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. ముఖ్యంగా వీరిద్దరిలో కామన్ పాయింట్ ఏమిటంటే ఇద్దరూ కూడా ఒకరిని మించి మరొకరు పొడగరులు కావడం. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరూ నటులుగా ఎంట్రీ ఇచ్చి తమ తండ్రుల మాదిరిగా టాలీవుడ్ లో కొనసాగుతారా లేక మరేదైనా ఇతర రంగాల్లో దూసుకెళ్తారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాలని, ఈ విధంగా ఈ వయసులోనే ఈ రేంజ్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న ఈ ఇద్దరు, ఒకవేళ హీరోలుగా మారితే తప్పకుండా తండ్రులను మించిన తనయులు అవుతారని అంటున్నారు పలువురు విశ్లేషకులు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: