ప్రస్తుతం జబర్దస్త్ లో ఎంతో మంది కొత్త కమెడియన్స్ వస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  కమెడియన్ గా  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణించాలనుకునే వారికి తమ టాలెంట్ నిరూపించుకోవడానికి మొట్టమొదటి వేదిక జబర్దస్త్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ కమెడియన్స్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే యువ కమీడియన్స్ టాలెంట్ కి అటు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తమదైన శైలిలో సరికొత్త కామెడీని పంచుతూ బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు యువ కమెడియన్స్.



 అయితే గతంలో పటాస్ అనే కామెడీ షో ద్వారా స్టాండప్ కామెడీ చేసిన ఎంతో మంది కమెడియన్స్ ఆ తర్వాత పటాస్ షో ఆపడంతో ఇక ఆ షో నుంచి జబర్దస్త్ లోకి ఎంట్రీ  ఇచ్చారు అనే విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ కు వచ్చిన తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకున్నారు తమదైన శైలిలో కామెడీ పంచారు. అదిరిపోయే పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ లో కామెడీ చేసే టాలెంటు ఉండడంతో పాటు మరికొన్ని రకాల టాలెంట్స్  ఉన్నప్పటికీ ఎప్పుడో ఒకసారి బయట పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నూకరాజు ఇటీవలే తనలోని కొత్త టాలెంట్ ను బయట పెట్టాడు..  ఇప్పటికేపలువురు సినీ సెలబ్రిటీల కు సంబంధించి మిమిక్రీ చేసే నూకరాజు ఇక ఇటీవలే ఒక అద్భుతమైన పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నాన్న నాన్న నాన్న..  నీ ప్రేమెంత గొప్పదో నాన్న.. అంటూ ఒక అద్భుతమైన పాట పాడిన నూకరాజు ఇక ఆ పాటకు తగ్గట్టుగా స్వరాన్ని సమకూర్చి.. అందరినీ వావ్  అనిపించాడు. అంతేకాదు ఇక నాన్న గొప్పతనాన్ని చెబుతూ నూకరాజు పాడిన పాట తో అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: