తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్స్ పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎప్పుడూ ఆరాటపడుతంటారు. వారి చిన్నప్పుడు ఏం చేశారు? ఫొటోల్లో ఎలా ఉన్నారు? నుంచి మొదలుకుని అన్ని విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తమ చిన్ననాటి విషయాలను, ఫొటోలను పంచుకుంటున్నారు. పలు ఇన్‌స్పైరింగ్ సంఘటనలను వారితో షేర్ చేసుకుంటున్నారు. అయితే, ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ క్యూట్ ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఆ ఫొటోను చూసి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టడం కొంచెం కష్టమే అని అనిపిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..


మలర్ భామ సాయిపల్లవి. మలయాళంలో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమాతో ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘ఫిదా’ చిత్రంలో భానుమతి‌గా తెలుగు వారి మది దోచుకుంది. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ యువకుల కలల రాణిగా మారింది పల్లవి. తాజాగా ఆమె చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ కాగా, అది ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇప్పటిలాగా చిన్నప్పుడు సాయిపల్లవి చాలా క్యూట్ ఉంది ఫొటోలో. పల్లవి సహజసిద్ధమైన స్టైలింగ్ చిన్నప్పటి నుంచే మెయింటేన్ చేస్తుందని ఆ ఫొటో చూసి చెప్పొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అద్భుతమైన నటనతో పాటు నెమలిలా నాట్యం చేస్తూ ప్రతీ ఒక్కరి ఫేవరెట్ హీరోయిన్ అయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డ్యాన్సింగ్‌లో సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసింది సాయిపల్లవి. ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో రానా ‘విరాట పర్వం’, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్‌గా నటించింది. ఈ రెండు చిత్రాలూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు నాని ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని కూడా చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: