బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా సల్మాన్ ఖాన్ కొనసాగుతున్నాడు. అయితే ఇక సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ కు సంబంధించి ఏ వార్త సోషల్ మీడియాలో కి వచ్చినా అది క్షణాల వ్యవధిలో  హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  ఓరి నాయనో సల్మాన్ ఖాన్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా అని వార్తలు చూసి అందరూ షాక్ అవుతూ  ఉంటారు ప్రస్తుతం ఒకవైపు హీరోగా సత్తా చాటుతూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సల్మాన్ఖాన్. మరోవైపు బుల్లితెరపై హోస్టుగా కూడా అవతారమెత్తి బిగ్ బాస్ అనే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇంకోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఇలా సినిమాలు బుల్లితెర కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు మరోవైపు వ్యాపారాలు అన్ని వైపుల నుంచి సల్మాన్ ఖాన్ కు భారీగానే ఆదాయం వస్తుంది. పారితోషికం విషయంలో ఎక్కడా వెనకడుగు వేయని సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా ఒకరోజు లో సల్మాన్ ఖాన్ సంపాదించే ఆదాయం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. సినిమాల్లో ఎలాగో సల్మాన్ ఖాన్ అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే ప్రస్తుతం బిగ్గెస్ట్ సెలబ్రిటీ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్బాస్ కార్యక్రమంలో హోస్ట్ గా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. 2010 నుంచి సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు. అయితే ప్రతి వారానికి 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట సల్మాన్ ఖాన్. ఇలా అయితే మొత్తంగా 14 వారాల గానూ బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ కి 350 కోట్లు రెమ్యునరేషన్ అందుతుందట. మరోవైపు తిరుమల రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. దీంతో ఇక ప్రతిరోజూ మూడు కోట్లకు పైగానే సల్మాన్ సంపాదన ఉంటుందని  ఒక టాక్ చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: