పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవరికైనా పవన్ కళ్యాణ్ మాత్రమే గుర్తుకు వస్తాడు. ఆయనతో పనిచేసిన సాంకేతిక నిపుణులను కూడా ఆయన మేనియాలో మరిచి పోతూ ఉంటారు. అయితే చిత్ర దర్శకుడు పేరు సైతం బయటకు వినపడకుండా ఉండడం అంటే పవన్ మేనియా ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పవన్ కు భారీ స్థాయిలో డిమాండ్ ఇమేజ్ ఉంది. రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ రాణించే విధంగా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆయన సినిమాలలో ఉంటే తప్పకుండా దేశం మొత్తం అలరించే హీరోగా ఎదిగే వాడే. 

అలాంటి పవన్ క్రేజ్ సినిమాల పరంగా బాగానే ఉంది కానీ రాజకీయంగా మాత్రం లేదు అని ఆయన తొలిసారి పాల్గొన్న ఎలక్షన్ ఫలితాలు నిరూపించాయి. సినిమాల వరకు అయితే ఓకే కాని రాజకీయంగా ఆయనకు అండగా ఉండలేము అని ప్రజలు తేల్చేశారు. అయినా కూడా ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఇప్పుడు భారీ స్థాయిలో ప్రజల లో తిరుగుతూ ఉన్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల నుండి కొంత బ్రేక్ తీసుకొని సినిమాలు చేస్తున్నాడు. అలా ఆయన హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఇప్పుడు శేరవేగం గా షూటింగ్ జరుపుకుంటుంది.

మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పన్ కోసియం చిత్రాన్ని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తుండగా ఈ సినిమా లో రానా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. సాయి పల్లవి మరియు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24వ తేదీన విడుదల కాబోతు ఉండగా కొంతమంది ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాగా అందరూ దీనిని చెబుతున్నారు కానీ ఎవరూ కూడా ఈ చిత్ర దర్శకుడిని పట్టించుకోకపోవడం ఆయన గురించి మాట్లాడకపోవడం నిజంగా సాగర్ చంద్ర బ్యాడ్ లక్ అని చెప్పాలి. త్రివిక్రమ్ దర్శకత్వం కాకుండా ఈ సినిమాకు రచయితగా వ్యవహరిస్తుండటం విశేషం. విడుదల తర్వాత అయినా ఈ దర్శకుడికి పేరు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: