ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ సమంత. ఆమె ఏ సినిమాలో నటించిన కూడా హీరో లను డామినేట్ చేస్తుందని ఒక ప్రశంస ఉంది. ఆ స్థాయి లో ఆమె తన నటనతో ఆకట్టుకుంటూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. వివాహం జరిగిన తర్వాత ఇక సినిమాలలో కనిపించదు అని చాలా మంది అనుకున్నారు. అనూహ్యంగా ఆమె విడాకులు పొందడం మళ్లీ సినిమాల్లో నటించడం జరుగుతుంది.తిరిగి వచ్చిన తర్వాత ఆమె మంచి మంచి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న ఈమె పెద్ద హీరోల సినిమాలలో కూడా నటిస్తుంది. 

ఈ నేపథ్యంలో సమంత నటిస్తున్న పెద్ద సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కశ్మీర్లో ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాలో సమంత పాత్ర కంటే విజయ్ దేవరకొండ పాత్ర హైలెట్ గా ఉండేలా చేశాడట. వాస్తవానికి ఏ సినిమాలోనైనా హీరో పాత్ర హైలెట్ గా నిలుస్తుంది కానీ సమంత నటించే సినిమాలలో సమంత పాత్ర ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది.

నటన విషయంలో ఇద్దరు కూడా కాంప్రమైస్ ఎవరు కాబట్టి తప్పకుండా ఇద్దరు పోటాపోటీగా ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వా త తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ను ఈ ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  మరి ఒక ఫ్లాప్ తో అందరి విమర్శలను ఎదుర్కొన్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా తో ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: