సోషల్ మీడియాలో తమ హీరో ని పొగుడుకోవడానికి ఏ ఒక్క సందర్భాన్ని మిస్ చేసుకోరు స్టార్ హీరోల ఫ్యాన్స్.  ఇన్నాళ్లు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అదే విధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా మాటల యుద్ధం చేసుకున్నారు అందరికీ తెలిసిందే . ఇప్పుడిప్పుడే ఈ సిచువేషన్ కూల్ అయ్యేవిధంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక స్టార్ హీరో ఫ్యాన్స్ యాక్టివ్ గా మారిపోయారు . తెలిసి చేస్తున్నారో  తెలియక చేస్తున్నారో కానీ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసి అనవసరంగా తమ ఫేవరెట్ హీరో పేరుని కాంట్రవర్షియల్ గా మార్చేస్తున్నారు .


నాని ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ . ఎప్పుడు వివాదాలు జోలికి పోడు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటాడు మ్యాటర్ ని చాలా కూల్ గా సాల్వ్ చేస్తాడు . అయితే అలాంటి నాని లోని వైల్డ్ యాంగిల్ ను బయట పెడుతూ హిట్ 3 సినిమా వచ్చింది.ఈ సినిమాను రీసెంట్ గానే మనం తెరపై చూసాం. ఈ సినిమాలో నాని  పర్ఫామెన్స్ చూస్తే ఒక్కొక్కడికి ఉ* పడిపోవాల్సిందే . ఆ రేంజ్ లోనే ఉంటుంది.  నాని నుంచి ఇలాంటి ఒక వైల్డ్ మూవీ వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు.



నిజానికి నాని అర్జున్ సర్కార్ పాత్రలో జీవించేసాడు . ఈ పాత్రకి మరి వేరే ఏ హీరో కూడా సూట్ కారు అని చెప్పడంలో సందేహమే లేదు. నాని ఫాన్స్ కూడా నాని లోని మార్పును బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  కాగా నాని సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా నాని సినిమాను పొగడమే కాకుండా రీసెంట్ గా బిగ్ స్టార్ సినిమాలు వచ్చి ఫ్లాప్ అయిన మూమెంట్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు.  మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా బడాబడా స్టార్స్ తామే పెద్ద హీరోలని తమ సినిమాలో 100 కోట్లు క్రాస్ చేస్తాయి అని కొంచెం హెడ్ వెయిట్ గా మాట్లాడుతూ ఉంటారు.



తమ సినిమాలు బాగున్న బాగో లేకపోయినా జనాలు ఆ సినిమాని వంద కోట్లు క్రాస్ చేసే రేంజ్ లోనే ఉంటారు అని ముఖ్యంగా ఫ్యాన్స్ ని బాగా నమ్మేస్తూ ఉంటారు . అయితే నాని ఫ్యాన్స్ ఇప్పుడు వాటిని తిప్పి కొడుతున్నారు ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి అని..తాతల పేర్లు చెప్పుకొని తొడ కొట్టడాలు.. నాన్నల పేర్లు చెప్పుకొని మీసాలు మెలి వేయడాలు ఇక చెల్లవు... హిట్ అంటే నాని హిట్ 3 ఇలా ఉండాలి ..కష్టపడి పైకి ఎదిగి సొంతంగా స్వయంకృషితో హిట్ కొట్టాలి. ఈ సినిమా నానికే కాదు ఇండస్ట్రీ లెక్కలలో కూడా మార్చేస్తుంది అంటూ కూసింత ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు నాని ఫ్యాన్స్ తెగ సందడి చేసేస్తున్నారు...!

మరింత సమాచారం తెలుసుకోండి: