సంగీత దర్శకుడుగా యంగ్ ఏజ్ లోనే దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిరుధ్ రవిచంద్రన్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన మ్యూజిక్ ని లైవ్ లో వింటే  చాలా మందికి గూస్ బంప్స్ వస్తాయి.. అలా తన మ్యూజిక్ తో ఎంతో మంది యూత్, పెద్దవాళ్ళని అలరించిన అనిరుధ్ రవిచంద్రన్ ఎఫైర్ల ద్వారా కూడా కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటారు.ముఖ్యంగా అనిరుధ్ రవిచంద్రన్ తన కంటే వయసులో పెద్దదైన నటి ఆండ్రియా తో చాలా రోజులు రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఏజ్ డిఫరెన్స్ కారణంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక అనిరుధ్ కి కేవలం ఆండ్రియాతోనే కాకుండా కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ తో కూడా ఈ ఎఫైర్ వార్తలు వినిపించాయి. 

కానీ వీరిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఈ విషయం పక్కన పెడితే..ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ అయినటువంటి కావ్య మారన్ తో అనిరుధ్ రవిచంద్రన్ డేటింగ్ చేస్తున్నారని,త్వరలోనే వీరి పెళ్లి జరగబోతుందని తాజాగా కోలీవుడ్ లో ఓ వార్త ఊపందుకున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచంద్రన్ కావ్య మారన్ ల ప్రేమ 2014లో స్టార్ట్ అయింది అని కొంతమంది అంటుంటే.. కాదు కాదు గత సంవత్సరం నుండి వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని ఇంకొంతమంది అంటున్నారు. వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లారని,హైదరాబాదులోని ఓ నైట్ పార్టీలో డిన్నర్ లో పాల్గొన్నారు అంటూ కూడా రూమర్లు చక్కర్లు కొట్టాయి. 

అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలపై అందరికీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు అనిరుధ్ రవిచంద్రన్.తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై అనురుధ్ రవిచంద్రన్ ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు  మరి ఇంతకీ ఆయన పెళ్లి గురించి ఏ విధంగా స్పందించారంటే.. పెళ్లి లేదు ఏం లేదు.. చిల్ అవుట్ గాయ్స్.. ప్లీజ్ ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆపండి అంటూ పోస్ట్ పెట్టారు. మరీ అనిరుధ్ రవిచంద్రన్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ వార్తలు ఆగిపోతాయా లేదా ఇంకా ఎక్కువవుతాయా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: