ఈ విషయం వింటే మాత్రం రీల్ కాదు రియల్ గానే అల్లు అర్జున్ రష్మిక మందన్నా  కోరిక తీర్చారు అనుకుంటారు చాలామంది నెటిజన్స్. మరి ఇంతకీ రష్మిక మందన్నా కోరికని అల్లు అర్జున్ ఏ విధంగా తీర్చారు.. ఇంతకీ రష్మిక మందన్నా కోరిక ఏంటి.. అని చాలామందిలో మైండ్ లో ఓ ప్రశ్న అయితే మెదులుతూ ఉంటుంది. ఎందుకంటే రష్మిక మందన్నా కోరిక అల్లు అర్జున్ తీర్చడం ఏంటి అని.. అయితే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.. అదేంటంటే.. అల్లు అర్జున్ రష్మిక మందన్నా కాంబోలో పుష్ప,పుష్ప-2  రెండు సినిమాలు వచ్చాయి. మొదటి పార్ట్ లో శ్రీవల్లి అంటే రష్మిక మందాన్నాని ప్రేమించే పాత్రలో అల్లు అర్జున్ నటించి మొదటి పార్ట్ ఎండింగ్ లో వీరిద్దరి పెళ్లి జరుగుతుంది.ఇక రెండో పార్ట్ లో వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపిస్తారు.

అయితే పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ ని రష్మిక మందన్నా సీఎంతో ఫోటో కావాలి అని అడుగుతుంది.అయితే పుష్ప -2 లో సీఎంగా ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ కి ఫోటో ఇవ్వడానికి నిరాకరిస్తాడు. దాంతో ఆ అవమానం అలాగే మైండ్ లో పెట్టుకొని సీఎంనే మార్చేసి తనకి అనుకూలంగా ఉన్న వ్యక్తిని సీఎంని చేసేస్తాడు పుష్ప. అలా సీఎం ఫోటో ఇవ్వలేదని ఏకంగా పుష్ప సీఎం నే గద్దె దించుతారు. అయితే పెళ్ళాం కోసం పుష్ప-2  సినిమాలో పుష్ప అలా సీఎంనే మార్చేస్తాడు. ఇక రష్మిక మందన్నా సినిమా కోసం సీఎంతో ఫోటో కావాలి అని అడుగుతుంది.కానీ తాజాగా ఒక ఫోటోను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

అదేంటంటే పుష్ప -2 లో అల్లు అర్జున్ భార్య గా చేసిన రష్మిక మందన్నా సీఎంతో ఫోటో కావాలని రీల్ లైఫ్ లో అడుగుతుంది. ఇక అల్లు అర్జున్ రీల్ లైఫ్ లో రష్మిక కోరిక తీర్చడం కాదు రియల్ లైఫ్ లోనూ కోరిక తీర్చేశాడు. ఎందుకంటే తాజాగా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్స్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఫోటో దిగుతారు. ఇక ఈ ఫోటో పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రష్మిక రీల్ గా సీఎంతో ఫోటో కావాలంటే అల్లు అర్జున్ రియల్ గానే సీఎంతో ఫోటో దిగారు. రష్మిక కోరికను రియల్ గానే తీర్చేసారు అంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: