స్టార్ హీరో ప్రభాస్  స్టార్ డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కిన  ది  రాజాసాబ్ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.  ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.  దర్శకుడు మారుతి  డైలాగ్స్ విషయంలో ఎంతో  కేర్ తీసుకున్నారు. టీజర్ చూస్తే వింటేజ్ ప్రభాస్ ను  చూసిన భావన కలుగుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.  కథ మరీ కొత్తదేం కాకపోయినా  కథనంతో అద్భుతం చేసేలా సినిమా ఉండనుందని తెలుస్తోంది.

టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా ప్రభాస్ ను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారో మారుతి అదే విధంగా చూపించారని అర్థమవుతోంది.  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ లకు టీజర్ లో ప్రాధాన్యత  దక్కింది.  148 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్  ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బీజీఎమ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వ్యూస్ పరంగా టీజర్ రికార్డులు క్రియేట్  చేస్తోంది.  హర్రర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని  ప్రభాస్ వైబ్ మాత్రం గట్టిగా ఉందని  ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెల 5వ తేదీన  ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస్ మరో లుక్ ను టీజర్ లో చూపించలేదు.  ఆ లుక్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రివీల్ అవుతుందని తెలుస్తోంది.  దాదాపుగా 300 కోట్ల  రూపాయల బడ్జెట్ తో  ఈ సినిమా తెరకెక్కుతోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ  బ్యానర్ పై  ఈ సినిమా తెరకెక్కగా ఖర్చు విషయంలో నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడలేదని టీజర్ చూస్తే  అర్థమవుతోంది.  సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రభాస్  ది  రాజాసాబ్ సినిమాతో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.  ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరిగే ఛాన్స్ అయితే ఉంది. సినిమా సినిమాకు స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ పెరుగుతోంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: