చెన్నై సోయగం త్రిష కృష్ణ‌న్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ వన్నె తగ్గని అందం, వరస అవకాశాలతో స్టార్ బ్యూటీగా సత్తా చాటుతోంది. మధ్యలో  ఫ్లాపులతో కొన్నాళ్లు సైలెంట్ అయిన కూడా `పొన్నియన్ సెల్వన్` సినిమాతో త్రిష స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బ్యూటీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. త్రిష‌కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.
నిజమైన ఏనుగులను బంధించి దేవుడి సేవకు వినియోగించడం క‌రెక్ట్ కాదని భావించి ప‌లు స్వచ్ఛంద సంస్థలు ఈ మ‌ధ్య కాలంలో యాంత్రిక ఏనుగులను దేవాలయాలకు బహుమానంగా ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా త్రిష కూడా అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి `గజ` అనే ఖ‌రీదైన రోబోటిక్ ఏనుగును కానుక‌గా అందించింది.
చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి త్రిష ఈ ప‌ని చేసింది. రీసెంట్‌ గానే సాంప్రదాయ మంగళవాద్యాల మధ్య ఆ ఏనుగు దేవాలయంకు చేరుకుంది. భ‌క్తులు ఎంతో ఉత్సాహంగా ఏనుగును ద‌ర్శించుకుని ఫోటోలు దిగుతున్నారు. త‌మిళ‌నాడులో ఆలయ వేడుకల కోసం ఈ విధంగా రోబోటిక్‌ ఏనుగును ఇవ్వ‌డం ఇదే తొలిసారి. త‌మిళ హీరోలు కూడా చేయ‌ని ప‌ని త్రిష చేయ‌డంతో ఆమెపై సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: