- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి నట‌సింహ బాలకృష్ణ - బి.గోపాల్ కాంబినేషన్ అంటేనే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి కాంబినేషన్లో లారీ డ్రైవర్ - రౌడీ ఇన్స్పెక్టర్ - సమరసింహారెడ్డి - నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే బాలకృష్ణ - కోదండరామిరెడ్డి కాంబినేషన్ కూడా మంచి బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక బాలకృష్ణ - బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. అదే రోజు బొబ్బిలి సింహం సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వాస్తవానికి ఏ సినిమాకు కూడా బిగోపాల్ ను దర్శకుడుగా అనుకున్నారు. అలాగే బాలయ్యకు కలిసి వచ్చిన విజయశాంతిని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు.


సేమ్ రౌడీ ఇన్స్పెక్టర్ కాంబినేషన్ రిపీట్ చేయాలని అనుకున్నారు. బొబ్బిలి సింహం సినిమాను విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత టీ త్రివిక్రమరావు నిర్మించారు. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లే సమయానికి హీరోయిన్ తో పాటు దర్శకుడు కూడా మారిపోయారు. హీరోయిన్లుగా విజయశాంతి స్థానంలో మీనా - రోజా వచ్చి చేరారు. ఇక దర్శకుడుగా బి గోపాల్‌కు బదులుగా కోదండరామిరెడ్డిని తీసుకున్నారు. బొబ్బిలి సింహం సినిమా కూడా బాలయ్య కెరీర్లో మరుపురాని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో సెంటిమెంట్ ఎమోషనల్ యాక్షన్ అదరగొట్టేసింది. పలు కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: