
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను వకీల్ సాబ్, ఎంసీఏ సినిమాల దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా కంప్లీట్ యాక్షన్ , ఎమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది ... శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా కు ఈ రోజు ప్రీమియర్ షోలు ప్లాన్ చేశామని నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా తన తాజా ఇంటర్వ్యూ లో ప్రకటించారు.
అయితే ఇప్పుడు నెలకొన్న ఓ వివాదం కారణంగా దిల్ రాజు తమ్ముడు సినిమా ప్రీమియర్ షో ల నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివాదం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి చేసిన కామెంట్లు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తమ్ముడు సినిమాకు పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ చిత్రాన్ని జూలై 4 న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిపోయింది. తమ్ముడు సినిమా లో లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు