సినిమాకి ఆయూపట్టులాంటి వాళ్లు  డైరెక్టర్లు. వాళ్ల చేతుల్లోనే అంతా ఉంటుంది. సినిమా హిట్ అవ్వాలి అన్నా.. ఫట్ అవ్వాలి అన్నా..  పూర్తిగా వాళ్లపైనే డిపెండ్ అవుతుంది. నార్మల్ స్టోరీని కూడా హైలైట్ చేస్తూ, డిఫరెంట్ ఎలివేషన్స్ చూపిస్తూ, తెరకెక్కించి హిట్ కొట్టిన డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. రీసెంట్‌గా వీరు ఇద్దరూ తెరకెక్కించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన "కూలీ" మూవీ.. అలాగే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన "వార్ 2" రెండూ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి.
 

ఈ రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, వార్ 2 తో కంపేర్ చేస్తే కూలీ సినిమా ఇంకా హైలైట్‌గా మారింది. కూలీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌ని బాగా పొగుడుతున్నారు. నార్మల్ కాన్సెప్ట్ స్టోరీని కూడా హై ఎలివేషన్స్‌తో చూపించి, ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టకుండా థియేటర్‌ నుంచి పంపించాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నాయని, కొన్ని సీన్స్ ముందుగానే అంచనా వేసేలా ఉన్నాయని కూడా చెప్పుతున్నారు. ఆ కారణంగానే వార్ 2 సినిమాకి కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ వచ్చింది. మిగతా అన్ని పాయింట్స్ కూడా హైలైట్‌గానే ఉన్నాయని అంటున్నారు.



అయాన్ ముఖర్జీ కి ఇంకా తన డైరెక్షన్‌లో మరింత డెప్త్‌కి వెళ్లి, ప్రేక్షకులకు నచ్చే విధంగా క్లైమాక్స్ లాంటి సీన్స్‌ను తెరకెక్కించేంత కెపాసిటీ రావాలని మాట్లాడుతున్నారు. లోకేష్ కనగరాజ్‌లో ఉన్న ప్లస్ పాయింట్ .. ఎటువంటి సీన్ అయినా హైలైట్ చేస్తూ డైరెక్ట్ చేయడం. అదే కూలీ సినిమాకి ప్లస్‌గా మారింది. ఇక ఎంత బాగా రాసుకున్నా సరే, అయాన్ ముఖర్జీ కొన్ని సీన్స్‌ను సరిగ్గా తెరకెక్కించలేకపోయాడు. అదే వార్ 2కి నెగిటివ్‌గా మారిందని ప్రేక్షకులు అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: