సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ సినిమా ఈ రోజు అనగా ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ... శృతి హాసన్ , ఉపేంద్రమూవీ లో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అమీర్ ఖాన్మూవీ లో చిన్న క్యామియో పాత్రలో కనిపించనున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ఈ మూవీ బృందం వారు భారీ ధరకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అత్యంత భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి సంస్థ వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కొన్ని వారాల దియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలు ఎవరైనా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో చూడాలి అనుకుంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు ఫ్రీ సేల్స్ ద్వారానే 100 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. వంద కోట్ల వరకు కలెక్షన్స్ ఈ సినిమాకు ప్రీ సేల్స్ ద్వారానే వచ్చాయి అంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలను ఉన్నాయో మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఈ సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేయడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: