
అయితే తాజాగా ఈ లిస్టులోకి హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయాడు. తన తాజా సినిమా కిష్కిందపురి ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత పది నిమిషాల్లోనే ప్రేక్షకులంతా కథలో మునిగిపోతారని, ఎవరికీ మొబైల్ ఫోన్ పట్టుకోవాలనిపించదని, అంత రేంజ్ లో సినిమా ఎంగేజ్ చేస్తుందని ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే సినిమా గురించి ఆయన చూపించిన కాన్ఫిడెన్స్ ఓ రేంజ్ లోనే కాదు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టుగా ఫీలయింది. ప్రమోషన్లలో ఆయన మాట్లాడిన తీరు, సినిమా హైప్ పెంచేలా ఉంది.
సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. రిలీజ్ రోజున థియేటర్స్ దగ్గర బాగా క్రేజ్ క్రియేట్ అయినా, సినిమా గురించి వచ్చిన ఫస్ట్ టాక్ మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పినంత హైప్ రేంజ్‌లో లేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “సినిమా బాగుంది, కాన్సెప్ట్ ఫ్రెష్‌గా ఉంది, కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ హీరో చెప్పినంత గ్రాండ్ హైలైట్‌గా మాత్రం లేదు” అని ప్రేక్షకుల రియాక్షన్ స్పష్టంగా కనపడుతోంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా పబ్లిసిటీ స్టంట్స్ చేయడం కాస్త తగ్గిస్తే బెటర్ అని సోషల్ మీడియాలో కొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. కిష్కిందపురి సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయి పాజిటివ్ రివ్యూస్ అందుకుంటున్నా.. ప్రేక్షకులు కథ,కాన్సెప్ట్ గురించి మిక్స్‌డ్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై మరింత దృష్టి పడుతోంది.
ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఈ సినిమా హీరో కెరీర్‌కి పెద్ద బూస్ట్ అవుతుందని, బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అనుకున్నారు. కానీ రిజల్ట్ చూస్తే ఆ అంచనాలకు తగ్గట్టుగా సీన్ లేకపోవడం క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి సినిమా మీద పడింది. “తన కెరీర్‌లో మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి ఆయన ఎలాంటి కథ ఎంచుకుంటాడు?”, “తన ఇమేజ్‌ను సేఫ్ చేసుకోవడానికి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాడు?” అనే ప్రశ్నలు సినీ సర్కిల్‌లోనే కాదు, అభిమానుల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి.
మొత్తం మీద కిష్కిందపురి సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకంటూ ఒక మంచి మార్క్ సంపాదించుకున్నా, ఆయన చెప్పినంత హైప్ రేంజ్‌ను చేరుకోలేకపోవడం ఒక వాస్తవం. భవిష్యత్తులో ఇలాంటి ఓవర్ కాన్ఫిడెంట్ ప్రమోషన్లకు బదులుగా సినిమానే మాట్లాడేలా చేస్తే మంచిది అని ఫ్యాన్స్, సినీప్రేమికులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి..? దానికి ఎంత బజ్ వస్తుందనే కుతూహలం మాత్రం ఆగడం లేదు!