ఇప్పుడిది సినిమా ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా “ఓజీ, ఓజీ, ఓజీ” అంటూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ రిలీజ్‌కు ఇక మరికొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించబోతుందని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు.


అయితే, రిలీజ్ టైమ్ దగ్గర పడేకొద్దీ మెగా అభిమానుల్లో ఒక కొత్త టెన్షన్ మొదలైంది. మెగా ఫ్యామిలీ ఇన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఆ లోటును పవన్ కళ్యాణ్ తీరుస్తాడా..? లేదా..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.మెగా ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కుటుంబం. ఆ ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. అందుకే ఈ ఫ్యామిలీపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ కాలేదు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ డిజాస్టర్ అయింది. ఆ సినిమా ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు కూడా మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే స్థాయిలో నిలవలేదు. అంతకుముందు వచ్చిన చాలా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగానే నిలిచాయి.



ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ హిట్ అవ్వడం చాలా కీలకం. ఈ సినిమా హిట్ అయితే, మళ్లీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందినట్టే అవుతుంది. అందుకే ఓజీపై మెగా అభిమానులు విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి రిలీజ్ అవుతున్న చివరి సినిమా ఇదే కావడంతో, దీనితో మెగా ఫ్యామిలీకి సూపర్ ఎండ్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఓజీపై మంచి హైప్, పాజిటివ్ బజ్ ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.



కొంతమంది ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతుండగా, మరికొంతమంది మాత్రం అడపాదడప నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: