ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ తో సహా ఎవరు కూడా అసెంబ్లీ వైపు చూడడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి మరీ వెళ్ళిపోతున్నారు. ఇదే తరుణంలో టిడిపి జగన్ పై ఎలాగైనా అనర్హత వేటు వేయాలని ప్రయత్నం చేస్తోంది. ఇదే తరుణంలో వైసిపి ఎమ్మెల్సీ రఘురాం రియాక్ట్ అయ్యారు. మీకు దమ్ముంటే జగన్ పై అనర్హత వేటు వేయండి అంటూ సవాల్ విసిరారు. మరి అనర్హత వేటు వేయడం సాధ్యమవుతుందా  అనేది చూద్దాం.. టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం అసెంబ్లీ జరిగింది 24 రోజులు.

 రాబోవు పది రోజులతో కలిపి 34 రోజులు అవుతుంది. అంటే అనర్హత వేటు వేయాలంటే ఇంకా 26 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరగాలి. అంటే 2024లో ఎలక్షన్స్ జరిగాయి. అసెంబ్లీ సమావేశాల సెషన్ పూర్తి అవ్వాలి అంటే 2025, 2026 వరకు వెయిట్ చేస్తే అప్పటి వరకు కూడా జగన్ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 15 నెలల్లో కేవలం 24రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఇంకో 15 నెలల్లో కూడా 24 రోజుల జరిగితే మొత్తం 48 రోజులవుతుంది. ఆ తర్వాత మరో 15 నెలల్లో  24 రోజులు జరిగితే 60 రోజులు పూర్తవుతుంది. అలాగని  సభలు ఎక్కువ రోజులు జరుపుదామంటే ప్రశ్నించే  ప్రతిపక్షం అసలే లేదు. ఎక్కువ రోజులు సభ జరిపితే సొంత పార్టీ వాళ్లు నిలదీసే అవకాశం ఉంది. ఈ లెక్కను బట్టి చూస్తే మాత్రం టిడిపి అనర్హత వేటు వేయడం కష్టం.

వీళ్లు కావాలని వేయాలనుకుంటే మాత్రం వరుసగా 60 రోజులు సభ జరిపించి మరీ వేయవచ్చు. కానీ అలా చేయడం ఇబ్బందికరమే. కానీ ఆయన ప్రతి ఏడాది గవర్నర్ ప్రసంగం సమయంలో ఉభయసభల సమావేశానికి జగన్ వస్తున్నారు. అయితే టిడిపి గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయితే అది లెక్కలోకి రాదంటున్నారు. ఈ విధంగా టిడిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ రఘురాం రివర్స్ లో పంచ్ ఇచ్చారు. వైసిపికి ఉప ఎన్నిక అంటే భయమేం లేదు. రాష్ట్రమంతా వైసిపి నాయకులను రాజీనామా చేస్తాం. ఉపఎన్నిక పెట్టే దమ్ముందా  అంటూ సవాల్ విసిరారు. అసలు ఉపఎన్నిక ద్వారానే వైసిపి వెలుగులోకి వచ్చిందంటూ మాట్లాడారు. మరి చూడాలి ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఎక్కడికి దారితీస్తాయి అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: