స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. పుష్ప , పుష్ప 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఒక్క సినిమా తీస్తే రూ.80 నుంచి రూ .100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ సినిమాల ద్వారా బాగానే సంపాదిస్తూ ఉంటే, అల్లు అర్జున్ వల్ల తన తండ్రికి రూ.40 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని వినిపిస్తున్నాయి. అయితే ఇది పాత విషయమైనా ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అల్లు అర్జున్, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన బద్రీనాథ్ సినిమా ముందుగా అల్లు అరవింద్ రిజెక్ట్ చేశారట. కానీ అల్లు అర్జున్ కథ విన్ని ఇందులో ఉండే యాక్షన్స్ సన్నివేషాలు బాగున్నాయని ఈ సినిమా చేయాలని పట్టుబట్టి మరి చేశారు. వాస్తవంగా ఈ సినిమా రిజల్ట్ పైన ముందుగానే అల్లు అరవింద్ కి డౌట్ వచ్చి ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. కానీ బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువ అవ్వడంతో అప్పుడు అల్లు అర్జున్ మార్కెట్ కు మించి మరి బడ్జెట్ అయింది.  తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే డిజాస్టర్ గా మిగిలింది.


దీంతో ఈ సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో నష్టాలు కూడా కొంతమేరకు ఎక్కువగానే వచ్చాయని,ఈ సినిమాకి ఎంత లేదనుకున్న 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని స్వయంగా అల్లు అరవింద్ తెలియజేశారు. ఈ సినిమా వల్ల కొన్ని రోజులపాటు పెద్ద సినిమాలను నిర్మించలేదట అల్లు అరవింద్. తిరిగి మళ్ళీ కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని, తన సినీ కెరియర్ లో ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయని తెలిపారు. అందుకే ప్రతి సినిమా విషయంలో జాగ్రత్తపడి ముందుకు వెళ్తానని తెలిపారు అల్లు అరవింద్.

మరింత సమాచారం తెలుసుకోండి: