సాధారణంగా పాములను చూస్తే ప్రతి ఒక్కరి  వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎక్కడైనా పాము ఉంది అని తెలిస్తే అటువైపు వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక ఏదైనా పాము మనవైపు వస్తుంది అని తెలిస్తే పరుగోపరుగు అంటూ అక్కడి నుంచి జంప్ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒళ్ళు గగుర్పొడిచే ఘటన జరిగింది. రెండేళ్ల పాప చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. తనను కాటేసిన పాము పై ప్రతీకారం తీర్చుకుంది 2 ఏళ్ల పాప. ఈ ఘటన  టర్కీ లో వెలుగులోకి వచ్చింది.


 తను కాటేసిన పాము ను గట్టిగా పట్టుకున్న రెండేళ్ల పాప ఇక ఆ పామును కొరికి కొరికి చంపేసింది. బింగోర్ నగరంలో ఓ చిన్నారి బయట ఆడుకుంటుంది. ఇలాంటి సమయంలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పాము సడన్గా అక్కడ ప్రత్యక్షమైంది. దాదాపు అర మీటరు పొడవు ఉంటుంది.. ఇక అది గమనించకుండా బాలిక తన ఆటల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ఆ పాము బాలిక కింద పెదవిపై కరిచింది. ఈ క్రమంలోనే మొదట భయపడిన చిన్నారి ఆ తర్వాత కోపంతో ఊగిపోయింది.


 కాటువేసి పారిపోతున్న సర్పాన్ని చేతిలో గట్టిగా పట్టుకుంది. దీంతో ఇక ఆ పామును కసితీరా కొరికి చంపేసింది. అయితే ఇది గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే వెంటనే పాపని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పాప పాముకాటుకు గురి అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే పాము విషానికి విరుగుడు మందులు ఇచ్చారు. సదరు రెండేళ్ల చిన్నారిని 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు డాక్టర్లు. ప్రస్తుతం ఆ పాప కోలుకుంటుంది అనేది తెలుస్తుంది. కాగా పాప పామును కొరికి చంపడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: