ప్రెసిడెంట్ అభ్యర్థిగానే పనికిరావని వెక్కిరించినా.. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించినా, మీడియా, వ్యాపారవేత్తలందరూ గెలుపును అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా.. విజయాన్ని తన ఖాతాలో వేసుకుని విజయగర్వంతో అగ్రరాజ్య పీఠాన్ని అధిష్టించి.. ప్రంపంచ పెద్దన్నకు పాలకుడు కాబోతున్నారు డోనాల్డ్ ట్రంప్. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 మిలియన్ డాలర్లను (1363 కోట్ల 11 లక్షల రూపాయలు) ఖర్చు చేయబోతున్నట్లు అధికారిక అంచానా. ఈ ఖర్చును స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు, ఫెడరల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారమహోత్సవ కమిటీ భరిస్తుంది. 



అమెరికాయే ముందు (అమెరికా ఫస్ట్‌) అనేదే తన పాలన మంత్రమని అమెరికా నూతనాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూత్రీకరించారు. అధికారాన్ని వాషింగ్టన్‌ డీసీ నుంచి ప్రజలకు బదలాయించడం తన ధ్యేయమని ప్రకటించారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకురావడానికి, దేశాన్ని పునర్నిర్మించి ప్రజల కలలను సాకారం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుందన్నది అప్రస్తుతం. దాన్ని ప్రజలు నడిపిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. 2017 జనవరి 20.. ప్రజలు తిరిగి పాలకులైన రోజుగా గుర్తుండిపోతుంది. ఇంతకాలం ప్రజలను విస్మరించారు. ఇక అందుకు వీలు లేదు. ఇప్పుడు అందరూ మీ మాట వింటున్నారు. ప్రపంచం ఎన్నడూ చూడని రీతిలో ఈ చరిత్రాత్మక ఘటనలో పాలుపంచుకునేందుకు మీరు లక్షలాదిగా తరలివచ్చారు. అందరి నమ్మకం ఒక్కటే.. దేశం ఉన్నది పౌరుల కోసమే. అమెరికా ప్రజలు గొప్ప పాఠశాలలు, సురక్షితమైన ఇరుగుపొరుగు, మంచి ఉద్యోగాలను కోరుకుంటున్నారు.



 అమెరికా ప్రజలారా.. ఒక్క మాట వినండి. మిమ్మల్ని తిరిగి నిర్లక్ష్యం చేయటం జరగదు. మీ మాటలు, మీ ఆశలు, మీ కలలు అమెరికా తలరాతను నిర్దేశిస్తాయి. మీ ధైర్యం, మీ మంచితనం, మీ ప్రేమ మాకు నిరంతరం మార్గ నిర్దేశం చేస్తుంటాయి. మనం కలిసికట్టుగా అమెరికాను తిరిగి సుదృఢం చేస్తాం. తిరిగి సుసంపన్నం చేస్తాం. అమెరికా గౌరవాన్ని తిరిగి నిలబెడతాం. అమెరికాను తిరిగి సురక్షితం చేస్తాం. అవును.. మనమంతా కలిసికట్టుగా అమెరికాను తిరిగి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం. ధన్యవాదాలు. దేవుడు రక్షించుగాక’’

మరింత సమాచారం తెలుసుకోండి: