వయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడడం అనేది సహజం, సర్వ సాధారణం. మరి కొన్ని సార్లు అబ్బాయి కంటే అమ్మాయి కొన్ని ఏళ్లు పెద్దది అయినా వారిద్దరు ఇష్టపడడం వల్ల వివాహానికి ఒప్పుకున్నాం అని తల్లిదండ్రులు చెప్పడం కూడా మనం చాలా సార్లు వినే ఉంటాం. కులాంతర, మతాంతర వివాహాలు కూడా నేటి ఆధునిక సమాజంలో సహజం అయిపోయాయి. కానీ ఒక యువకుడు బామ్మ ప్రేమలో పడడం ఎప్పుడైనా చూశారా..? అని అడిగితే లేదనే చెబుతాం.


అరుదైన ప్రేమకథ.. అతనికి 28, ఆమెకు 82

కానీ ఇక్కడ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 28 సంవత్సరాల యువకుడు, 82 ఏళ్ల బామ్మ తో ప్రేమలో పడ్డాడు. వినడానికి ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా నమ్మక మాత్రం తప్పదు. ఈ జంటను ఓ ఫోన్ కాల్ కలిపింది. ఇరు కుటుంబాల వారు షాకయినా ఈ ప్రేమ జంట (!) వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ ఘటన ఇండొనేషియాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మాంటెహేగ్ కు చెందిన సోఫియన్ లోహా డాండెల్ (28) అనే యువకుడికి ఓ రోజు మార్తా పొటూ అనే మహిళ నుంచి కాల్ వచ్చింది.


Image result for marraige

ఆపై తాను పొరపాటున కాల్ చేసినట్టు చెప్పింది. అయితే, ఆ కాల్ వారిద్దరి మధ్యా పరిచయాన్ని పెంచగా, ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోఫియన్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఒకరి గురించి తెలుసుకున్నారు. అయితే ఆమె వయసు గురించి సోఫియన్ ఆరా తీయలేదు. కొన్ని నెలలు ఇలా గడిచిన తర్వాత సోఫియన్ తన ప్రేయసిని కలవాలని నిర్ణయించుకున్నాడు. 120 కిలో మీటర్ల దూరం ప్రయాణించి దక్షిణ మినహాసాలోని లీలెమా అనే గ్రామంలో ఉన్న ప్రేయసి దగ్గరకు వెళ్లాడు. .


Image result for marraige

తొలుత షాక్ తిన్నా, తనది నిజమైన ప్రేమని, ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న డాండెల్ తల్లిదండ్రులు తొలుత విస్తుపోయినా, ఆపై పెళ్లికి అంగీకరించారు. దీంతో 18వ తేదీన వారి వివాహం జరుగగా, ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: