ప్రేమ కు కులాలు, మతాలు, జాతులు, ప్రాంతం తదితర వాటితో సంబంధం ఉండదు. అందుకే ప్రేమ గుడ్డిదని పూర్వికులు అంటున్నారు. కేవలం ఒక మగ, ఒక అడ ఆలోచనలు, అభిప్రాయాలు, దృక్పథాలు కలిస్తే ప్రేమ పుడుతుంది. వారిద్దరిని ఒక్కటి చేస్తుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన దేశంలో అమలులో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమ నిబంధనలు అడ్డుపడుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కేవలం ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికే వర్తిస్తుంది తప్పా.. ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ఇవి ఏ మాత్రం అడ్డుకావు. అయితే ఒక ఎమ్మెల్యే, ఒక ఐఏఎస్ అధికారిని ఇద్దరు ప్రేమలో పడ్డారు. 


ఓ ఎమ్మెల్యే.. ఓ ఐఏఎస్‌.. ఓ లవ్‌ స్టోరీ

అతనేమో పూర్తిస్థాయి రాజకీయ నాయ కుడు. ఆమె స్వతంత్రభావాలు కలిగిన యువ అధికారిణి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కె.ఎస్‌.శబరినందన్, తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌లు ప్రేమలో పడ్డారని గత కొంతకాలంగా కేరళలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు మంగళవారం శబరినందన్‌ తన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్‌ను మార్చి దీన్ని ధ్రువీకరించారు. సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌ను తిరువనంతపురంలో కలిశాను. సాన్నిహిత్యం పెరిగాక తెలిసింది మా ఇద్దరి ఆలోచనలు, ఆసక్తులు, దృక్పథాలు ఒకటేనని. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో దివ్య త్వరలో నా జీవిత భాగస్వామి కాబోతోంది. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని 33 ఏళ్ల శబరినందన్‌ పోస్ట్‌ చేశారు.


Image result for love

ఇలా ఎమ్మెల్యే లు, సివిల్ సర్వీస్ అధికారులు ప్రేమలో పడడం అనేది ఇప్పుడెం కొత్త కాదు. ఇప్పటివరకు చాలా మంది సివిల్ సర్వీస్ అధికారులు, రాజకీయ నాయకులను పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రేమ ఎక్కడ, ఎవరితో, ఎప్పుడు పుడుతుందో..? అస్సలు తెలియదు. మన లాగ ఆలోచించే, నడుచుకొనే వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అయినా, పురుషుడు అయినా కనెక్ట్ అయిపోవడం నేటి కొత్త తరం యువతరానికి మామూలే. 

మరింత సమాచారం తెలుసుకోండి: