టీడీపీ లోంచి ఏ నిమిషం బయటకి వచ్చారో కానీ ఆమంచి కృష్ణ మోహన్ చంద్రబాబు నాయుడు కి ఫుల్ డోస్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎంతో మంది టీడీపీ లోంచి బయటకి వచ్చారు టీడీపీ లోకి వెళ్ళారు కానే .. ఎవ్వరూ కనీ వినీ ఎరుగనట్టు ఆమంచి ప్రవర్తన ఉంది. పొలిటికల్ గా ఆయన కదిపే ప్రతీ పావూ చాలా తెలివిగా ఉంటోంది. ఒక పక్క తెలివైన అడుగులు వేస్తూనే చంద్రబాబు ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడుతున్నారు ఆమంచి.


Image result for amanchi krishna mohan

” కులం ” అనే అంశం మీద చంద్రబాబు గురించి ఎవ్వరూ ఎప్పుడూ పబ్లిక్ గా ఈ రేంజ్ లో మాట్లాడలేదు. అనెకానేక విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి కానీ పబ్లిక్ గా మినిమం కూడా ఎవ్వరినీ కేర్ చెయ్యకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ని ఒకరకంగా ఫుట్ బాల్ ఆడేసారు ఆమంచి . ఏ రకంగా అయితే చంద్రబాబు తన సామాజిక వర్గం జనాలని తన చుట్టూరా పెట్టుకున్నారు అనేది కుండ బద్దలు కొట్టారు. ప్రతీ శాఖ లో ముఖ్యంగా పోలీస్ శాఖ లో చంద్రబాబు వర్గం జనాలు ఆయన చుట్టూ ఏరకంగా విష వలయం లాగా మారిపోయారు అనేది తూర్పార బట్టేసారు ఆమంచి. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు కామనే కానీ అధికార పక్షాన్ని కడిగేస్తూ ప్రూఫ్ లతో సహా , లెక్కలు చెబుతూ విమర్శలు చెయ్యడం చిన్న విషయం కానే కాదు. ఆమంచి మాట్లాడిన మాటలు వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. 


Related image

" ఆయన కి కులపిచ్చి ఉందొ లేదో ఆయనే అంతః పరిశీలన చేసుకోవాలి - రాష్ట్రానికి కళ్ళూ ముక్కూ చెవులు ఐన ఇంటలిజెన్స్ వ్యవస్థ లో కూడా ఆయన సామాజిక వర్గం వారే.. చట్టం లో లేని జీవో కూడా ఇచ్చి ఏ డీ జీ వెంకటేశ్వర రావు తాలూకా జనాలని పెట్టుకున్నారు. ఇంటలిజెన్స్ వ్యవస్థ - పోలీస్ శాఖ ని సమన్వయము చెయ్యడానికి ఒక పోస్ట్ ని సృష్టించి మరీ తన సామాజికవర్గానికి ఇచ్చుకున్నారు.. ఈ రాష్ట్రము లో ఎవ్వరైనా చంద్రబాబు ని కలవాలి అంటే పీ ఎస్ ద్వారా కలవాల్సి ఉంటుంది వాళ్ళని కూడా తమ సామాజిక వర్గం వారినే పెట్టుకున్నారు.. ఇరవై మంది సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి .. ఆయన సామాజికవర్గం కి సంబంధించిన వ్యక్తులు ఇండియన్ పోస్టల్ సర్వీస్ , ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ , ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇలా అనేక డిపార్ట్ మెంట్ ల నుంచి వాళ్ళు వస్తే 15 మంది చంద్రబాబు సామాజిక వర్గం వారే ఉన్నారు.. రీసెంట్ గా వెంకట రెడ్డి అనే అతను IAS గా వస్తే ' రెడ్డి ' అనేది ఉంది అని అతనికి పోస్టింగ్ ఇవలేదు .. " అని ఆమంచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నాయ్. 


Image result for chandrababu naidu

 
 
కేంద్రం నుంచి రప్పించిన కొందరు ఆఫీసర్ లలో కూడా తమ కులం వారే ఉండేలా బాబు ప్లాన్ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. డీ ఐ జీ , ఏ డీ ఐ జీ ఇలా అందరూ బాబు కులం వారితో పోలీసు శాఖ నిండిపోయింది అని తెలిపారు. చంద్రబాబు కి ప్రభుత్వం మీద పూర్తిగా పట్టు కోల్పోయింది అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.ఆయన చేతిలో కూడా ఏమీ లేదు అనీ కొందరు కులం వాళ్ళు గుత్తాదిపత్యం కోసం ఆయన్ని నడిపిస్తున్నారు అనే మాట స్పష్టంగా చెప్పారు ఆమంచి. త్వరలో పక్కా ప్రూఫ్ లతో చంద్రబాబు కుల భాగోతం బయట పెడతా అంటూ సంచలన ప్రకటన చేసారు.


Image result for chandrababu naidu


మరింత సమాచారం తెలుసుకోండి: