అధికారంలోకి వచ్చాక జగన్ నిర్ణయాలు చకచకా తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో చూపిస్తున్న చొరవ మెచ్చుకోదగ్గది.  ఎవరికి తలొగ్గకుండా.. డేర్ గా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  


రీసెంట్ గా జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ హైదరాబాద్ నుంచే పరిపాలన సాగిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు వచ్చినపుడు ప్రయివేట్ హోటల్ లో ఉండి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయేవారు.  


ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ రాజ్ భవన్ గురించి జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో సీఎం క్యాంపు ఆఫీస్ ఉన్నది.  గతంలో చంద్రబాబు నాయుడు విజయవాడ క్యాంపు ఆఫీస్ నుంచి కొన్ని రోజులు పరిపాలన సాగించారు.  ఇప్పుడు ఆ క్యాంపు ఆఫీస్ ఖాళీగా ఉన్నది.  దీనిని జగన్ గవర్నర్ కోసం కేటాయించాలని అనుకుంటున్నారు.  


రాజ్ భవన్ గా దీనిని మార్చాలని అనుకుంటున్నారు.  ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉన్నారు.  కానీ, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ వస్తారనే వార్తలు వెలువడుతుండటంతో... రాజ్ భవన్  తాలూకు జగన్ ఈ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: