తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలై తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె 9వ రోజుకు చేరుకున్నప్పటికీ... ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం పై  ప్రభుత్వం ఇంకా మొండి వైఖరి వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో  బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా... ప్రయాణికుల  అవసరాలను తీర్చేందుకు  అద్దె  ప్రైవేటు బస్సులు నడుపుతుంది ప్రభుత్వం. అయితే ఓ వైపు ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విజయం సాధించామని చెబుతున్నప్పటికీ... ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు మాత్రం పూర్తిస్థాయిలో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చడం లేదు. 

 

 

 

 

 

 ఈ నేపథ్యంలో రోడ్లపై పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు... బస్సుల్లో కిక్కిరిసి  ప్రయాణం చేస్తున్నారు. బస్సులు ఎక్కువ మొత్తం లో  లేకపోవడంతో వచ్చిన బస్సులోనే లిమిట్  కు మంచి ప్రయాణం చేస్తున్నారు. బస్సుల కోసం గంటల కొద్ది వేచి చూస్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరో వైపు బస్సులు నడిపేందుకు తాత్కాలికంగా నియమించబడ్డ డ్రైవర్లు ఇష్టానుసారంగా బస్సులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు గా నియమితులైన వారిలో ఎక్కువమంది అనుభవం లేని వారి ఉండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

 

 

 

 

 అయితే ఇప్పటికే పలు చోట్ల తాత్కాలికంగా నియమింపబడిన డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయగా ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ లో  బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ లోని  హయత్ నగర్  భాగ్యలత సెంటర్ వద్ద బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు... అదుపు తప్పి ఓ బైక్ ను  విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి గాయాలపాలయ్యాడు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహించిన ప్రయాణికులు స్థానికులు... డ్రైవర్ ని  బస్సు నుండి కిందకు దించి దాడిచేశారు. అయితే ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను నడుపుతున్నట్లు చెబుతున్నప్పటికీ... తాత్కాలిక డ్రైవర్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా డ్రైవింగ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ఆర్టీసీ సమ్మె కూడా రోజు రోజుకీ ఉదృతంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: