తాజ్ మహల్ అనగానే ఆగ్రాలోని పాలరాయితో తయారు చేసిన తెల్లని తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది.  భార్య ముంతాజ్ కోసం అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన కట్టడం తాజ్ మహల్.  అలాంటిది ప్రపంచంలో మరొకటి ఉండకూడదని, తాజ్ మహల్ ను నిర్మించిన వ్యక్తులను ఆ రాజు హత్య చేయించినట్టు ప్రచారంలో ఉన్నది.  పాపం వాళ్లకు తెలియదు అనుకుంటా కట్టడాలకు నకళ్లు సృష్టించడంలో మనవాళ్ళు దిట్ట అని.  


ఆగ్రాలోని తాజ్ మహల్ ను పోలిన మరో మహల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్న సంగతి అందరికి తెలుసు.  దాన్ని మినీ తాజ్ మహల్ అంటారు.  అయితే, భార్య కోసం షాజహాజ్ తాజ్ మహల్ కట్టిస్తే.. ఓ మహిళ తన భర్త కోసం తాజ్ మహల్ కట్టించింది.  అదే కూడా ఆగ్రాలోనే ఉండటం విశేషం.  ఈ తాజ్ మహల్ ఇప్పటికి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.  


అయితే, ఈ తాజ్ మహల్ చూడటానికి ఎరుపు రంగులో ఉంటుంది.  దాన్ని రెడ్ సాండ్ స్టోన్ తో నిర్మించారు.  ఆగ్రాకు సమీపంలో ఉన్న క్రైస్తవ సమాధుల దగ్గర ఓ తాజ్ మహల్ కనిపిస్తుంది.  అది కల్నల్ జాన్ హెస్సింగ్ సమాధి.  అయన మరణం తరువాత ఆయన భార్య అనె హెస్సింగ్ ఈ సమాధిని నిర్మించింది.  చూడటానికి అచ్చంగా అది తాజ్ మహల్ లా ఉంటుంది.  గుమ్మటాలు, ప్రాకారాలు అన్ని అలానే ఉంటాయి. కాకపోతే ఇది ఎరుపు రంగులో ఉంటుంది.  


ఈ సమాధిని 1803లో నిర్మించారు.  నెదర్లాండ్ దేశంలో 1739 వ సంవత్సరంలో పుట్టిన హెస్సింగ్ తన 13 ఏటా యునైటెడ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికుడిగా చేరాడు.  నెదర్లాండ్ నుంచి శ్రీలంక వచ్చి అక్కడ ఐదేళ్లు ఉంది తిరిగి స్వదేశానికి వెళ్ళాడు.   ఆ తరువాత అయన తిరిగి ఇండియా వచ్చి నిజాం ప్రభువుల కొలువులో యూరోపియన్ సైనికుడిగా పనిచేశారు.  అక్కడి నుంచి అయన ఆగ్ర వెళ్లారు.  అక్కడే మరణించారు.  తన భర్త మృతికి గుర్తుగా భార్య అనె హెస్సింగ్ ఈ సమాధిని నిర్మించింది.  ఇది ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: