హైదరాబాద్ లోని హయత్ నగర్ లో సంచలనం సృష్టించిన రజిత హత్య కేసు కొలిక్కి వచ్చింది. శశికుమార్ కీర్తిపై, కీర్తి ఆస్తిపై కన్నేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి మద్యం తాగించి తల్లి రజితను హత్య చేసేలా ప్రేరేపించాడు. కీర్తి తల్లి కళ్లల్లో కారం కొట్టి ఆమె గుండెలపై కూర్చున్న సమయంలో శశికుమార్ రజిత మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఇంటర్ చదివే సమయంలో కీర్తికి శిల్ప అనే స్నేహితురాలు ఉండేది. 
 
శిల్ప ఇంటికి కీర్తి తరచూ వెళ్లటంతో కీర్తికి శిల్ప సోదరుడు బాల్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. బాల్ రెడ్డి కీర్తిని లోంగదీసుకోవటంతో కీర్తి గర్భవతి అయింది. కీర్తి అబార్షన్ కొరకు తన ఇంటిదగ్గర ఉండే శశికుమార్ సహాయం కోరింది. అబార్షన్ చేయించిన శశికుమార్ ఆ తరువాత కీర్తిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత కీర్తితో సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలను తీసి వాటిని కీర్తికి చూపించి బెదిరించాడు. 
 
బాల్ రెడ్డితో కీర్తి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలియటంతో తల్లిదండ్రులు బాల్ రెడ్డితో పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తరువాత కీర్తి శశికుమార్ తో చనువుగా ఉండటంతో రజిత కూతురిని మందలించింది. రజిత చిట్టీలు, వడ్డీల ద్వారా కూడబెట్టిన సొమ్మును సొంతం చేసుకోవాలనే ఆలోచనతో శశికుమార్, కీర్తి కలిసి రజితను హత్య చేశారు. తల్లిని హత్య చేసిన కీర్తిలో తప్పు చేశాననే బాధ ఏ మాత్రం లేకపోవటం గమనార్హం. 
 
కీర్తి తండ్రి శ్రీనివాస్ లారీ డ్రైవర్ కావటంతో ఇంటిదగ్గర ఎక్కువగా ఉండేవాడు కాదు. తల్లి రజిత కీర్తితో ఎప్పుడు కఠినంగా ఉండేదని తెలుస్తోంది. కీర్తి తన స్నేహితుల దగ్గర తన తల్లిదండ్రులు తనను పట్టించుకోరని చెప్పి బాధ పడేది. తల్లి తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోవటంతో ఆమె మొదట బాల్ రెడ్డికి ఆ తరువాత శశికుమార్ కు దగ్గరైంది. తల్లిదండ్రులు తనను పట్టించుకోవటం లేదని కోపం పెంచుకున్న కీర్తి తల్లిని చంపటానికి సిద్ధమైంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: