అమలాపాల్ అంటే ఈ మధ్య రిలీజ్ అయిన ఆమె
మూవీ గుర్తుకువస్తుంది. న్యూడ్ పాత్రలో అమల చేసిన
సినిమా ఇంది. మిగిలిన హీరోయిన్లు అసలు సాహసం చేయలేని పాత్ర ఇది. అమల మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అంటూ చేసింది. ఆమె కష్టానికి తగిన ఫలితం ఈ
మూవీ ఇవ్వలేకపోయింది కానీ అమల మాత్రం తనకు అవకాశం వస్తే
దేనికైనా రెడీ అంటుందన్నది అర్ధమైపోయింది. ఇదిలా వుండగా అమలకు ఇంకా బోల్డ్ నెస్ మీద, ఆ టైప్ ఆఫ్ మూవీస్ మీద మోజు పోలేదంటోంది.
అందుకే
తమిళ్ లో మరో బోల్డ్
మూవీ చేస్తోంది. అదో అంద పార్వై పోల పేరుతో తమిళంలో తీస్తున్న మూవీలో అమలా మళ్ళీ న్యూడ్ గా కనిపిస్తోందంటూ ప్రచారం సాగుతోంది. మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీలో మనుషులను తినే నర హంతకులు, ఆటవిక జాతుల వారి మధ్యన చిక్కుకున్న ఒక అమ్మాయిగా అమలాపాల్ చేస్తోందిట.
ఈ మూవీకి సంబంధించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయి భయం కలిగించేలా సాగింది. ఈ టీజర్లో అమల న్యూడ్ కనిపించకపోయినా బట్టలు విప్పబోతున్న సీన్లు చూపించారు. నిజానికి అల్టిమేట్ అనదగ్గట్లుగా ఆమె మూవీని అమలాపాల్ చేసింది. అందులో న్యూడ్ నెస్ కి జోహార్లు అన్నారంతా. మరి అలా చేసిన తరువాత కూడా మరో బోల్డ్ ఫిల్మ్ లో వెంటనే యాక్ట్ చేయడం అంటే అమలకే సాధ్యమంటున్నారు. అన్నట్లు అదో అంద పార్వై పోల చిత్రానికి అమల కూడా నిర్మాణ భాగస్వామిగా ఉందిట. సో హిట్ అయితే పేరు, డబ్బు కూడా వస్తాయి కదా. ఇక ఈ మూవీని తెలుగులో డబ్బింగ్ చేస్తారంటున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందో.