ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం అండదండలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థం అయిపోతుంది. ముఖ్యంగా జగన్ తీసుకున్నమూడు రాజధానితో పాటు శాసన మండలి రద్దు తదితర విషయాల్లో ఈ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్నినేరుగా ఒప్పుకునేందుకు ఆ పార్టీ ఇష్టపడకపోయినా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ పార్టీ నాయకుల స్టేట్మెంట్స్ చూస్తే అర్థమైపోతోంది.ఇక మూడు  రాజధానుల విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోమని జగన్ ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ అనే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించినా .. తెలుగుదేశం పార్టీ మాత్రం దానిని ఒప్పుకునేందుకు ఇష్టపడడం లేదు. 


ఇంకా ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో మూడు రాజధానుల  అంశం పై పోరాటం చేస్తూ రాజధాని అమరావతి లో ఉంచాలంటూ డిమాండ్ చేస్తోంది .దీనిపై తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి తప్ప మిగతా ఏ ప్రాంతాలను ఒప్పుకోము అంటూ మారం చేస్తోంది. టిడిపి పదే పదే రాజధాని విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అంటూ చెప్పడంపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు. 


చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే రాజధాని అంశంలో కేంద్రాన్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజధాని అనేది రాష్ట్రపతి పరిధిలోని అంశమని, దీంట్లో కేంద్రానికి సంబంధం లేదని చెబుతున్న చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటూ మండిపడుతున్నారు. తాజాగా ఇదే విషయమై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు .మూడు రాజధానుల  విషయంలో బిజెపి వైఖరి స్పష్టంగా చెబుతున్నప్పటికీ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈ అంశంలో కి బీజేపీని  లాగాలని చూస్తున్నారని మండిపడ్డారు.


 2015 లోనే అమరావతి రాజధానిగా గుర్తిస్తూ అప్పటి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో కు కేంద్ర మద్దతు ఇచ్చినా ఆ జీవోను మార్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చంద్రబాబు ఇచ్చిన జీవో ఏమైనా శిలాశాసనామా అంటూ జివిఎల్ మండిపడ్డారు. తాము ఇప్పటికీ ఆ విషయాన్ని స్పష్టంగానే చెబుతున్నామని, ఏపీ రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకుంటూ జీవీఎల్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. బిజెపి ఎంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ బాబు తన వైఖరి లో అయితే పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇక జగన్ నిర్ణయాలకు కేంద్రం మద్దతు ఇస్తున్న సంకేతాలు కూడా చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు అనే విషయం అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: