2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రోజురోజుకు ప్రజల మద్దతును పెంచుకుంటున్నారు. మోదీ తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 లాంటి సంచలన నిర్ణయాలు ప్రజల్లో ఆయనపై విశ్వాసాన్ని పెంచాయి. పైకి ఎంతో సౌమ్యంగా కనిపించే మోదీ అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయరు. మోదీ నాయకత్వంలో దేశ ఖ్యాతి ఎంతో పెరిగింది. ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ ను మరింత ఉన్నతంగా నిలపడంలో మోదీ సక్సెస్ అయ్యారు.
 
మరి మోదీపై దేశంలోని ఎంతమంది ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారనే ప్రశ్నకు దేశంలోని 87 శాతం మంది ప్రజలు మోదీ పాలనపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మోదీపై ప్రజల్లో ఉన్న విశ్వాసం వల్లే 2019లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. దేశంలో మోదీని వ్యతిరేకించే వాళ్ల కంటే ప్రశంసించే వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేసినన్ని రోజులు దేశంలో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి.
 
అయితే కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేస్తే ఆర్థిక సంక్షోభంతో పాటు దేశంలో ఆకలి చావులు నమోదయ్యే అవకాశం ఉంది. ఎడిల్మన్ ట్రస్ట్ చేసిన తాజా సర్వేలో ప్రపంచ దేశాల్లోని పాలకుల పట్ల సర్వే చేయగా మోదీకి 87 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు. దేశంలో నెలకొన్న సంక్షోభాలను మోదీ పరిష్కరించగలడని ప్రజలు నమ్ముతున్నారు. ట్రంప్ పై మాత్రం కేవలం 53 శాతం మంది అమెరికా ప్రజలు మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు.
 
జపాలో 53 శాతం, ఇంగ్లాండ్ లో 57 శాతం, కెనడాలో 67 శాతం మంది ప్రజలు ఆయా దేశాల పాలకుల పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి కోసం మోదీ ఎంతో శ్రమిస్తున్నాడని మన దేశం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయని పాలకుల తప్పు లేదని ప్రజలే చెబుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: