ఎన్నికల పోలింగ్ కు ముందు, జనసేన ఆవిర్భావం, పవన్ మోడీకి మద్దతు పలకడం, చంద్రబాబుకు ఓటేమయమని పిలుపునివ్వడంతో పాటు ఆయన పెంచిన గడ్డం కూడా బాగా చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబుకు గడ్డం ఒక సిగ్నేచర్. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కూడా గడ్డంతోనే కనిపించాడు. వాళ్లకు తోడు పవన్ కూడా పెద్ద గడ్డం పెట్టేసుకొని తోడవ్వడంతో ఇదంతా ఒక గడ్డం గ్యాంగ్ అనే కామెంట్ వినిపించసాగింది. అయితే ఇప్పుడు పవన్ గడ్డం తీశాడు. చంద్రబాబు గడ్డం తీసే అవకాశం లేదు, ఇంకా మోడీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. చివరిదశ ఎన్నికలకపై ఆయన దృష్టి సారించాడు. అయితే పవన్ మాత్రం ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మాయమై ఇప్పుడు గడ్డం లేకుండా ప్రత్యక్ష్యం అయ్యాడు. ఎన్నికల ముందు పవన్ గడ్డం చర్చనీయాంశం అయినందున, ఇప్పుడు ఆ గడ్డం తీసేయడాన్ని కూడా ప్రస్తావించుకోవాల్సి వస్తోంది. మరి గడ్డం సంగతి ఇలా ఉంటే.. జనసేన పరిస్థితి ఏమిటి? ఆ పార్టీ ఉన్నట్లా? లేనట్లా? ఆమధ్య జనసేనగుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొన్న పవన్ బ్యాచ్ తర్వాత దాని గురించి పట్టించుకోలేదట. తమకు ఫలానా గుర్తు కావాలని పవన్ అనుచరులు అడగడం లేదట. అలాగే జనసేన అనే పేరు విషంలో ఉన్న వివాదాల గురించి పవన్ గ్యాంగ్ పట్టించుకోవడం లేదట. దీంతో అసలు ఈ పార్టీని రిజిస్టర్ చేయించడంపై కూడా పవన్ బ్యాచ్ కు పెద్దగా ఆసక్తి లేదేమో, ఇక జనసేన పరిస్థితి అంతేనేమో! అనే అనుమానాలూ నెలకొంటున్నాయి. మరి రానున్నకాలమే ఇలాంటి సందేహాలకు సమాధానం ఇస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: