రాజధానిగా అమరావతిని గుర్తించిన తరువాత గత ఐదేళ్ళ టీడీపీ హాయాంలో  గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. అప్పట్లో పాత రేకుల షెడ్డులా ఉండే ఎయిర్‌పోర్ట్‌ను ఏడాది వ్యవధిలోనే ఆధునీకరించారు. ఆ తర్వాత న్యూ టెర్మినల్ కూడా నిర్మించారు. ప్రభుత్వ పెద్దలు, వీఐపీలు, అధికారులు రాకపోకలతో గన్నవరం ఎయిర్‌పోర్ట్ రద్దీగా మారింది. ఆ తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. సింగపూర్ సర్వీస్‌లు కొన్నాళ్లపాటు తిరిగి ఆ తర్వాత నిలిచిపోయాయ్. ఎయిర్‌ పోర్ట్‌లో ఇతర నిర్మాణాల కోసం భూముల్ని సేకరించి పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు కీలకమైన రన్‌ వే విస్తరణ ప్రస్తుతం పూర్తయింది.

గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటి వరకు పాత రన్ వే 2 వేల 286 మీటర్ల పొడవున ఉండేది. ఇప్పుడు 25 కోట్లతో 1074 మీటర్ల పెంచి.. కొత్త రన్ వేని నిర్మించారు. దీంతో రన్ వే పొడువు 3 వేల 360 మీటర్లకు చేరుకుంది. రన్ వే నిర్మణాన్ని 60 ఎకరాల విస్తీర్ణంలో అధికారులు చేపట్టారు. కొత్త రన్ వే పూర్తి కావటంతో ట్రయల్ రన్ నిర్వహించడానికి  డీజీసీఏ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఈ నెలఖారు కల్లా ట్రయిల్ రన్‌ను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో ఉన్న రన్ వేను పరిశీలిస్తే ఆరు గంటలు ప్రయాణించే సామర్థ్యం ఉన్న విమానాలు మాత్రం టేక్ ఆఫ్ అవటానికి మాత్రమే  అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా నిర్మించిన రన్ వే ద్వారా 16 నుంచి 17 గంటలపాటు ప్రయాణించే సామర్ధ్యం ఉన్న పెద్ద విమానాలు కూడా ల్యాండ్‌ చేస్ అవకాశం వచ్చింది.  డీజీసీఏ అనుమతి వస్తే అమెరికా, లండన్ వంటి విదేశాలకు డైరక్ట్‌గా విమానాలు నడపటానికి గన్నవరం ఎయిర్‌పోర్ట్ సిద్ధంగా ఉంది.

కరోనా సమయంలో వందే భారత్ మిషన్‌లో భాగం 200లకు పైగా పెద్ద విమానాలు అరబ్ దేశాల నుంచి గన్నవరంలో ల్యాండ్ అయ్యాయ్.  కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఎంపీలు గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే పరిశీలనలో లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం రన్‌ వే కూడా పూర్తి కావడంతో మరోసారి ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. రన్ వే తోపాటు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్, ఆప్రాన్లను 400 కోట్లతో నిధులతో చేపట్టారు. ఆక్యుపెన్సీ రేషియో కూడా ప్రతి ఏడాది లక్షలసంఖ్యలో పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాలు ఎగరటానికి కేంద్ర అనుమతి ఇస్తే గన్నవరం దిశ తిరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: