ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రముఖ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వ్యాఖ్యలు ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్‌పై బీజేపీ ఒక సర్జికల్ స్ట్రయిక్ చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో రెండు సర్జికల్ స్ట్రయిక్స్ చేయాల్సి ఉందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్లో  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ రెండూ మతతత్వ పార్టీలేనని వ్యాఖ్యలు చేశాడు జీవీఎల్. ఈ మేరకు ఆదివారం ఎంపీ జీవీఎల్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్‌లో క్రిస్మస్ పండుగ సంబరాలపై  ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.

ప్రభుత్వమే మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్‌లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. తిరుపతి  ఉప ఎన్నికలో వీటన్నింటిపై రెండు పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యలో కూడా ముస్లిం ఓట్ల కోసం పోలీసులను వేధించారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. లౌకిక పార్టీల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు...

ఇక ఏపీ గురించి మాట్లాడుతూ...తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రయిక్ అవసరమైతే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రయిక్స్ కావాల్సి ఉందని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసే మత రాజకీయాలపై ప్రజలే రెండు సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చే తీర్పుకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మత రాజకీయాలు చేశాయన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ రెండూ మత రాజకీయాల్లో పోటీ పడుతున్నాయని వ్యాఖ్యానించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: