దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది.. ఢిల్లీ లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల గురించే..దేశంలో  ఎప్పటినుంచో ఉన్న సమస్యలను పరిష్కరించి న మోడీ రైతుల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాడు. ఆర్టికల్ 370 , అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి విషయాల్లో దేశంలోని ప్రజలు మోడీ తెగ పొగిడేశారు. అయితే సరిగ్గా సంవత్సరం గడవక ముందే మోడీ ఇప్పుడు అందరికి వ్యతిరేకమైపోయారు.

ముఖ్యంగా రైతుల కు మోడీ అంటే ఆగ్రహం వస్తుంది..ఇదంతా ఒక్క పని వల్లే అంటే అందరు ఆశ్చర్యపోతారు.. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టం వల్ల దేశంలో ని రైతుల ఆగ్రహానికి గురయ్యారు మోడీ.. ఈ చట్టాన్ని తెచ్చినప్పుడు చాలా పార్టీ వద్దని వాదించాయి.. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ సైతం ఈ బిల్లు కు వ్యతిరేకంగా వాక్ అవుట్ చేశారు. దాంతో ఆదిలోనే మోడీకి హంసపాదు ఎదురైంది.  మోడీ ఏం తేల్చి ఈ బిల్లు ను ప్రవేశపెట్టారో కానీ ఆయనకు గతంలో ఎప్పుడు లేని వ్యతిరేకత మోడలింది.. ఢిల్లీ లో వేలాదిమంది రైతులు ఇప్పుడు చట్టాన్ని రద్దు  చేయాలనీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే..

అయితే ఇది చిలికి చిలికి గాలివానలా మారుతుంది.మోడీ అధికారం చేపట్టిన దాదాపు ఏడేళ్ల తర్వాత రైతు ఉద్యమం మూలంగా కలిగినంత ఇబ్బంది ఆయనకు గతంలో ఎన్నడూ లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో అనేక రకాలుగా రైతు ఉద్యమాన్ని చల్లార్చే యత్నం చేసినా ఫలితం రాకపోవడంతో ఆయనే నేరుగా రంగంలోకి వచ్చారు. రైతుల ఉద్యమానికి మద్ధతుగా నిలుస్తున్న ప్రతిపక్షాల మీద ఘాటు విమర్శలు చేశారు. అదేసమయంలో మరో సీనియర్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశాలవుతున్నాయి. ఏడాది పాటు చట్టాల అమలు చేసి చూద్దాం..ఆ తర్వాత రైతులకు నష్టం వస్తే తామే వెనక్కి తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదన ఆసక్తిగా కనిపిస్తోంది. ఆయన కామెంట్స్ పై కొందరు రైతులు తీవ్రంగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: