తెలంగాణ విద్యుత్ కష్టాలు ఒకరకంగా చంద్రబాబుకు అనుకూలంగా మారాయి. తెలంగాణలో ఆవరించి ఉన్న చీకట్లను చూపుతూ చంద్రబాబు మెరిసిపోతున్నాడు. తన దూరదృష్టిని తనే చెప్పుకొంటున్నాడు. తనను తానే అభినందించుకొంటున్నాడు. కేసీఆర్ కు తనలాగా దూదదృష్టి, విజన్ లేదని.. అందుకే తెలంగాణకు ఈ కష్టాలు వచ్చాయని చంద్రబాబు అంటున్నాడు. తనలాగా కేసీఆర్ కు విజన్ ఉండుంటే... తెలంగాణకు కరెంటు కష్టాలే ఉండేవి కాదని చంద్రబాబు స్పష్టం చేశాడు. మొత్తానికి తెలుగుదేశం అధినేత కేసీఆర్ ను ఈ విధంగా ఎండగడుతూ.. తనను తాను ప్రశంసించుకొంటున్నాడని చెప్పవచ్చు. అవతల వైపు ఏపీకి అనేక కష్టాలున్నాయి. తెలుగుదేశం ఎన్నో హామీలు ఇచ్చినా.. వాటిల్లో ఒకటీ అమలు కాలేదు. పెన్షనర్ల జాబితాలో కోతలు.. ఆదర్శరైతుల తొలగింపు... ఇంకా అనేక నిర్ణయాలు.. రాజధాని విషయంలో భూ సేకరణ వంటి వ్యవహారాలు తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకతను పెంపొందిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు అవేవీ సమస్యలు కానట్టుగా మాట్లాడుతున్నాడు. ఆంధ్రకు కరెంటు కష్టాలు లేవు, తెలంగాణకు మాత్రమే కరెంటు కష్టాలు ఉన్నాయి చూశారా.. అంటూ ఇదే తన సమర్థత అంటున్నాడు! మరి ఈ విధంగా సెల్ఫ్ డబ్బా... వాయించుకోవడం వరకూ బాగానే ఉంది. మరి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని పాలనా లోపాలను లెక్కేయడం మొదలుపెడితే.. అప్పుడు పరిస్థితి ఏమిటి?!

మరింత సమాచారం తెలుసుకోండి: