ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు బుర్రలో ఎన్నో ప్లాన్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతానికి రాజధాని నగర నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధ కనిపిస్తున్నా.. దాంతో పాటు సమాంతరంగా ఎన్నో ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలని ఆయన కలలు కంటున్నారు. మంగళవారం ఆయన రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తన మదిలోని ప్రణాళికలను అధికార్లతో పంచుకున్నారు. కొత్త రాజధాని నుంచి రాయలసీమకు నేరుగా 4 లైన్ రాజమార్గం నిర్మించాలన్నది వాటిలో ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ అన్నమాట. తిరుపతి, విజయవాడ, విశాఖ, రాజమండ్రి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని బాబు సూచించారు.               విశాఖపట్నంలో ఏవియేషన్ అకాడమీ నెలకొల్పనున్నట్టు చంద్రబాబు తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖ నగరాల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కలలు కంటున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఆట సౌకర్యాలు.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇంటర్నేషనల్ లుక్ ఉండాలన్నమాట. ప్రత్యేకించి విజయవాడలో భారీ ఆడిటోయం నిర్మిస్తారట. కూచిపూడి నృత్యానికి ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇక తర్వలోనే మచిలీపట్నం నౌకాశ్రయానికి మహర్దశ పట్టనుందట. టూరిజం డెవలప్ మెంట్ పైనా చంద్రబాబు దృష్టిసారిస్తున్నారు.                 విజయవాడలోని భవానీ ద్వీపాన్ని సింగపూర్ సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారట. కోస్తాలోని బీచ్ రోడ్డుకు సమాంతరంగా సాగరమాల పేరుతో హైవే నిర్మిస్తారట. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఐడియాలు చాలానే ఉన్నాయి. మరి వీటన్నింటి నిర్మాణానికి బడ్జెట్ ఎలా సహకరిస్తుంది.. ఇవన్నీ ఎన్నేళ్లలో సాకారమవుతాయి.. అన్న ప్రశ్నలకు మాత్రం సంతృప్తికర సమాధానాలు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: