సిఎన్‌ఎన్-ఐబిఎన్ నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మొదటి స్థానంలోకి వచ్చారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన రాజకీయ నాయకునిగా కెసిఆర్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కేరళలో పోరాడుతున్న ఐపిఎస్ అధికారి విజయన్‌ల మధ్య పోటాపోటీ సాగుతోంది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఆరవ స్థానంలో, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పదవ స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కేరళ ఐపిఎస్ అధికారి విజయన్‌ల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రారంభం నుంచి రెండవ స్థానంలో నిలిచిన కెసిఆర్ శనివారం మొదటి స్థానానికి చేరుకున్నారు. 2006 నుంచి సిఎన్‌ఎన్ ఐబిఎన్ ఈ పోటీలు నిర్వహిస్తోంది. వివిధ రంగాల్లో ప్రముఖులను నామినేషన్‌కు ఎంపిక చేస్తోంది. ఐపిఎస్ అధికారి విజయ్‌కు 21శాతం, అమీర్‌ఖాన్‌కు 8 శాతం, ఇండియన్ ఆర్మీకి 6 శాతం, సత్యనాదెళ్లకు 5% అమిత్‌షాకు 5%, అమీర్ ఖాన్ 4% ఓట్లతో ఏడవ స్థానంలో ఉన్నారు. మూడు శాతం ఓట్లతో ఇండియన్ హాకీ, ఎనిమిదవ స్థానంలో, మూడు శాతం ఓట్లతో చేతన్ భగత్ తొమ్మిదవ స్థానంలో, సానియా మీర్జా రెండు శాతం ఓట్లతో పదవ స్థానంలో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: