భారత కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం 'ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్' ఫైల్ చేయడానికి పాన్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఉండాలి. లేనిచో ప్రభుత్వం 10,000 రూపాయలు జరిమానా విధించడం తో పాటు పాన్ కార్డు కూడా ఇకపై పనిచేయకుండా చేస్తుంది. ఇచ్చిన గడువులోపు పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇంతకు ముందే ప్రకటించింది.

కానీ ఆ గడువు నాటికి ఎవరైతే తమ పాన్ కార్డు ఆధార్ తో లింక్ చేయరో.. వారు తమ పాన్ కార్డుతో బ్యాంకు ట్రాన్సాక్షన్ చేయలేరు. పెన్షన్, స్కాలర్‌షిప్, ఎల్‌పిజి సబ్సిడీ వంటి ప్రయోజనాలను కూడా ప్రభుత్వాల నుండి పొందలేరు. 2021, మార్చి 31వ తేదీ లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ మీరు ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానం చేయకపోతే  ఈ కింద ఇచ్చిన విధానాన్ని పాటించి 2 నిమిషాల్లోనే లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోండి.

స్టెప్ 1: మొదటిగా ఇ-ఫైలింగ్ వెబ్సైటు ---> www.incometaxindiaefiling.gov.in సందర్శించండి.

స్టెప్ 2: వెబ్‌పేజీ ఓపెన్ చేసిన అనంతరం మీకు  ఎడమ వైపున 'Quick Links' సెక్షన్ కనిపిస్తుంది. ఆ సెక్షన్ లో ‘లింక్ ఆధార్’ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: లింక్ ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4: ఆ వెబ్‌పేజీలో మీ Pan number, aadhar number, తదితర ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.

స్టెప్ 5: పుట్టిన సంవత్సరం మాత్రమే మీ ఆధార్ కార్డులో ఉంటే.. 'I have only year of birth in Aadhaar card' అనే ఆప్షన్ కింద చెక్ బాక్స్ లో టిక్ చేయండి .

స్టెప్ 6: మీ సమాచారం అంతా పొందుపరిచిన తర్వాత ‘నా ఆధార్ వివరాలను uidai తో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను’ అని ఆప్షన్ కింద చెక్ బాక్స్ లో టిక్ చేయండి.

స్టెప్ 8: మీ స్క్రీన్‌పై క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. క్యాప్చా కోడ్‌కు బదులుగా వన్-టైమ్ పాస్‌వర్డ్ లేదా OTP కోసం కూడా అభ్యర్థించవచ్చు. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో OTP రిక్వెస్ట్ చేసి OTP ఎంటర్ చేయండి.

స్టెప్ 9: చివరిగా ‘లింక్ ఆధార్’ బటన్‌పై క్లిక్ చేయండి..

అంతే 2 నిమిషాల్లోనే మీ పాన్ కార్డు ఆధార్ తో లింక్ అవుతుంది. మరో విధంగా కూడా మీరు మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయవచ్చు. దీనికోసం 567678 లేదా 56161 నెంబర్ కు "UIDPAN <12 డిజిట్ ఆధార్> <10-అంకెల పాన్>" టైపు చేసి SMS పంపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: