నిర్మ‌ల్ జిల్లా బైంసాలో మ‌రోసారి రెండు వ‌ర్గాల‌మ‌ధ్య అల్ల‌ర్లు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా నిర్మ‌ల్ జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలు ర‌మాదేవికి బెదిరింపు కాల్స్ రావ‌డం క‌లక‌లం రేపుతోంది. త‌నకు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని..ర‌క్ష‌ణ క‌ల్పించాంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో సంచ‌ల‌నంగా మారింది. అంతే కాకుండా బైంసా అల్ల‌ర్ల‌లో పాకిస్తాన్ పేరు వినిపించ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఈనెల‌ 12 వ తేదీ అర్ధరాత్రి 12:57 నుంచి వరుసగా మూడు సార్లు 92 3481411535 నంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ వచ్చాయని ర‌మాదేవి ఫిర్యాదులో పేర్కొంది. పాకిస్తాన్ కోడ్ నంబ‌ర్ గా 92 అనే నెంబ‌ర్ వ‌స్తుంది. ఇక‌ బైంసాలో ఎమ్మైఎం నేత‌ల‌కు వ్య‌తిరేఖంగా మాట్లాడినందుకు త‌న‌కు బెదిరంపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని ర‌మాదేవి పేర్కొన్నారు. అయితే రాత్రి స‌మ‌యంలో ఫోన్ లు రావ‌డంతో తాను లేప‌లేద‌ని ఆమె పేర్కొంది.

ఉద‌యం ప‌దిన్న‌ర కు మ‌రోసారి వీడియో కాల్ వ‌చ్చింద‌ని ఫోన్ లిఫ్ట్ చేయ‌గానే ఇండియా పై దుర్భాష‌లాడారని తెలిపింది. త‌న‌ను తిడుతూ చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు వెల్ల‌డించింది. ఈ విష‌యంపై విచార‌ణ జ‌రిపి వారిని అదుపులోకి తీసుకోవాల‌ని వెల్ల‌డించింది. మ‌రో వైపు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అనంత‌రం కూడా త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయ‌ని రామాదేవి చెబుతోంది. అంతే కాకుండా బైంసా అల్ల‌ర్ల వెన‌క రోహింగ్యాల హ‌స్తం ఉందంటూ ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అస‌లు బైంసా అల్ల‌ర్ల‌తో సంబంధంలేని అమాయ‌క హిందువుల‌ను అరెస్ట్ చేసి వారిపై కేసులు న‌మోదు చేశార‌ని ఆరోపిస్తోంది. హిందువుల‌ను చిత్ర హింస‌ల‌కు గురి చేస్తున్నారని వెంట‌నే వారిని విడుద‌ల చేయాల‌ని ర‌మాదేవి డిమాండ్ చేసింది. అంతే కాకుండా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ర్య‌ట‌న అనంత‌రం హిందువుల అరెస్ట్ సంఖ్య పెరిగింద‌ని ర‌మాదేవి ఆరోపించారు. వెంట‌నే హిందువుల‌ను విడుద‌ల చేయ‌కుంటే ప్ర‌జా ఉద్య‌మం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: