తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్. నాగార్జునసాగర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రం సీఎం కేసీఆర్ గురించి జాగ్రత్తగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ నాగార్జునసాగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే మాత్రం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విషయంలో సీరియస్ గా వెళ్ళే అవకాశం ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలు అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు.

ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా వెళ్లి కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు వేరు ఇక ముందు ఉండే పరిస్థితులు వేరు. ఇక ముందు అన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అని కొంతమంది అంటే అలా కాదని కేంద్ర ప్రభుత్వం వద్ద సీఎం కేసీఆర్ గట్టిగా మాట్లాడవచ్చు అని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో గట్టిగా అడగొచ్చు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గోదావరి జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉండవచ్చని కూడా తెలుస్తుంది. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పెద్దగా స్పందించే ప్రయత్నం చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న కేంద్రం కాళేశ్వరం విషయంలో మాత్రం ముందుకు వెళ్లడం లేదు. అందుకే కేసీఆర్ కాస్త కేంద్రంతో సీరియస్ గా వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: